యూవర్సిటీలో అమ్మాయిని బాయ్స్ హాస్టల్లోకి లాగి...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో పలువురు విద్యార్థులు తనను లైంగికంగా వేధించారని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థిని ఆరోపిస్తోంది. ఆగస్టు 28వ తేదీన జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా యువకులు తనను వేధించారన్నారు.
సమాచారం మేరకు.. సెకండ్ ఇయర్ హిస్టరీ విద్యార్థిని ఈ ఆరోపణలు చేసింది. కార్యక్రమం సందర్భంగా పదిమంది పురుష విద్యార్థులు తన పైన దాడి చేశారని, తనను బాయ్స్ హాస్టల్‌లోకి లాక్కెళ్లారని, అక్కడ తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి చెందిన వారు. ఈ విషయమై బాధిత విద్యార్థిని విశ్వవిద్యాలయ అథారిటీకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలోను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటన జరిగింది. తన దుస్తులు విప్పి, ఫోటోలు తీశారని సిక్కిం విద్యార్థిని ఒకరు సీనియర్ల పైన ఆరోపణలు చేసింది.












Click it and Unblock the Notifications