బాబా రామ్ దేవ్ కు చుక్కెదురు: కర్మ అన్నందుకు అంతర్జాతీయ సదస్సుకు డుమ్మా!

చెన్నై: యోగాగురువు బాబా రామ్ దేవ్ కు చుక్కెదురైయ్యింది. చెన్నైలోని మద్రాసు ఐఐటీలో జరుగుతున్న అంతర్జాతీయ క్యాన్సర్ రీసర్చ్ చర్చాగోష్టి సమావేశాలకు బాబా రామ్ దావ్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం ఆయన గతంలో చేసిన కర్మ అనే ఒక మాట కారణం పెద్ద వివాదానికి దారితీసింది.

 క్యాన్సర్ మహమ్మారి

క్యాన్సర్ మహమ్మారి

క్యాన్సర్ అనే మహమ్మారికి అందరూ దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికి గతంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన బాబా రామ్ దావ్ చెడుఅలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ మనకు దూరంగా ఉంటుందని చెప్పారు. ఆయన మాటల్లో అప్పుడు ఎలాంటి దురుద్దేశం లేదు.

 మంత్రి నోట కర్మ మాట

మంత్రి నోట కర్మ మాట


చెడు అలవాట్లకు బానిసలు అయిన వారికే క్యాన్సర్ వస్తోందని, అది వారు చేసుకున్న కర్మ అని అసోం మంత్రి హిమంత్ బిస్వా శర్మ గతంలో బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అదే కార్యక్రమంలో హాజరైన క్యాన్సర్ వ్యాది బాధితులు మంత్రి వ్యాఖ్యలకు షాక్ కు గురై ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాన్సర్ వ్యాది బాధితులు

క్యాన్సర్ వ్యాది బాధితులు


క్యాన్సర్ వ్యాదికి సంబంధించి ఎవరు చేసుకున్న కర్మకు వారే బలి అవుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి హిమంత్ బిస్వా శర్మ మాటల్లో ఎలాంటి తప్పు లేదని, ఆయన నిజం చెప్పారని బాబా రామ్ దేవ్ సైతం మద్దతు ఇవ్వడంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

 ఎలా పిలుస్తారు ?

ఎలా పిలుస్తారు ?

చెన్నైలోని మద్రాసు ఐఐటీలో జరుగుతున్న అంతర్జాతీయ క్యాన్సర్ వ్యాది రీసర్చ్ చర్చాగోష్టి కార్యక్రమంలో ప్రపంచంలో ఆ వ్యాదిని నిర్మూలించే నిపుణలు, ప్రోఫసర్లు, క్యాన్సర్ వ్యాది బాధితులు పాల్గొంటున్నారు. క్యాన్సర్ వ్యాది బాధితుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పతాంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్ ను ఎలా ఆహ్వానిస్తారని పలువురు ప్రశ్నించారు.

బాబా రావడం లేదు

బాబా రావడం లేదు


ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు మద్రాసు ఐఐటీలో అంతర్జాతీయ క్యాన్సర్ రీసర్చ్ చర్చాగోష్టి కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి బాబా రామ్ దేవ్ హాజరుకావడం లేదని ప్రోఫసర్ కరుణాగరన్ మీడియాకు చెప్పారు.

 ఈవెంట్ నిర్వహకులు

ఈవెంట్ నిర్వహకులు

మద్రాసు ఐఐటీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్యాన్సర్ రీసర్చ్ చర్చాగోష్టి కార్యక్రం నిర్వహిస్తున్న వారు బాబా రామ్ దేవ్ ను ఆహ్వానించారని, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తమకు సమాచారం వచ్చిందని ప్రోఫసర్ కరుణాగరన్ క్లారిటీ ఇచ్చారు. మద్రాసు ఐఐటీలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరై ఎందుకు వివాదంలో చిక్కుకోవాలి అని బాబా రామ్ దేవ్ భావించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+