మోక్షం కావాలంటే నాతో ఏకాంతంగా గడపాలి, బాధితురాలిలా..
తనతో ఏకాంతంగా గడిపితే మోక్షం దక్కుతోందని యోగ గురువు శివరామ్ రౌత్ ను అరెస్టు చేశారు. మహరాష్ట్రలోని సెవ్రిలో ఆదివారంనాడు వెలుగుచూసింది.
ముంబై: తనతో ఏకాంతంగా గడిపితే మోక్షం దక్కుతోందని యోగ గురువు శివరామ్ రౌత్ ను అరెస్టు చేశారు. మహరాష్ట్రలోని సెవ్రిలో ఆదివారంనాడు వెలుగుచూసింది.
పట్టణానికి చెందిన ఓ మహిళ మోక్షప్రాప్తి కోసం తనతో ఏకాంతంగా గడపాలని కోరాడు. దీంతో భయాందోళనలకు గురైన మహిళ తన భర్తతో కలిసి ఆర్ఎమార్గ్ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టింది. అంతేకాదు తన నివాసంలో ఉన్న యోగ గురువు శివరాంరౌత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు ఆయనపై ఐసీపీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేశారు. తన వద్ద యోగశిక్షణకు వస్తున్న పలువురి మహిళతో రౌత్ ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాడని బాధితురాలి భర్త చెప్పారు. వారంతా భయంతో ఈ విషయం బయటకు చెప్పడంలేదన్నారు. ఇప్పుడు మరికొందరు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదుచేసే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications