గురువు కోరిక తీర్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్: కానుకగా ‘కొత్త రోడ్డు’
కాన్పూర్: తమ గురువు సాయం కోరితే ఎవరైనా సరే కాదనగలరా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అదే చేశారు. తన గురువు కోరిక తీర్చి ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.
మహారాజ్‌పూర్‌లోని ఖోజావ్‌పూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నాగేంద్ర బాజ్‌పాయ్ ఇటీవల కాన్పూర్‌లో సీఎం యోగిని కలుసుకున్నారు. షాలెంపూర్ నుంచి ఖోజావ్‌పూర్ వరకు రోడ్డంతా గతుకుల మయమైపోయిందని, దాన్ని పునర్నిర్మించాలని కోరారు.

తన గురువు కోరిందే తడవుగా సీఎం యోగి సదరు పని పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచే ఆ రోడ్డు పనులు ప్రారంభమవడంతో యోగి తనకు ఇచ్చిన 'గురుదక్షిణ'పై బాజ్‌పాయ్ సంతోషం వ్యక్తం చేశారు.
'మా గ్రామంలో రోడ్డు సదుపాయం అధ్వాన్నంగా ఉందని సీఎం యోగి దృష్టికి తీసుకెళ్లాను. ఇదిగో చూడండి. ఆయన దేనికి ప్రాధాన్యత ఇస్తారో దీన్ని బట్టి అర్థమవుతోంది' అని సదరు ఉపాధ్యాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, యోగి ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో నాగేంద్ర బాజ్‌పాయ్ ఆయనకు గణితం బోధించారు.












Click it and Unblock the Notifications