అవినీతికి పాల్పడిన 600 మంది ఉద్యోగాలు ఊస్ట్...
పనితీరు సరిగాలేక పోవడంతోపాటు, అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు జవాబుదారిగా చేసేందుకు యోగి ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కొరఢా ఝలిపిస్తున్నాడు.
ఓవైపు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీ స్థాయి అధికారులు కూడ ఉదయం తోమ్మిది గంటలకే తమ కార్యాలయాలకు చేరుకోవాలనే నిబంధన విధించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు సరిగా పని చేయాని గుర్తించి వారిపై చర్యలు చేపడుతుంది. ఈనేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన సుమారు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్దమవుతోంది. ఇక ఇంటికి పంపే వారిలో అందరు 50 సంవత్సరాల పైబడిన వారేనని తెలుస్తోంది..వీరిలో వయస్సు కంటే పని భారం వల్లే ఉద్యోగలు వీడే అవకాశం కల్గుతుందని అధికారులు తెలుపుతున్నారు.

ఇక వీరితో పాటు పనితీరు సరిగా లేని,అవినీతి పాల్పడిన ఉద్యోగులను మరో 477 మందిని ఉద్యోగాల నుండి తొలగించే ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగ వారిలో ఎక్కువగా విద్యుత్‌రంగ సంస్థల నుండి ఉన్నారని చెప్పారు. మరోవైపు ఉద్యోగుల పనితీరు బాగా ఉంటే, వారిని రివార్డులతో సన్మానిస్తామని , అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇంటికి పంపించడం కూడ జరుగుతుందని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో హెచ్చరించారు సీఎం యోగి అధిత్య నాథ్.
కాగా ఇదివరకే ప్రకటించిన ఉద్యోగుల పని గంటల విధానంపై పోలీసు డిపార్ట్‌మెంట్ నుండి పలువురు అధికారులు వ్యతిరేకిస్తున్నారు. తోమ్మిది గంటలకే కార్యాలయాలకు రావాలనే నిబంధన పోలీసులకు వర్తించదంటూ ఓ జిల్లా స్థాయి ఎస్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీంతో యోగి ప్రభుత్వం ఉద్యోగులపై తీసుకుంటున్న కఠిన చర్యలు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications