వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి, అఖిలేష్‌లకు యోగి గట్టి షాక్, ఇక సామాన్యులకే..

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతిలకు భద్రతను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతిలకు భద్రతను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

<strong>యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం</strong>యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం

వీరితో పాటు ములాయం కుటుంబ సభ్యులు డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, అజం ఖాన్, రాంగోపాల్ యాదవ్‌లకు కూడా భద్రతను తగ్గించారు. బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్‌తో పాటు మరికొందరికి భద్రతను పెంచారు.

వినయ్ కటియార్‌కు జెడ్ కేటగిరీ

వినయ్ కటియార్‌కు జెడ్ కేటగిరీ

వినయ్ కటియార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. శనివారం రాత్రి హోంశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

151 మంది వీఐపీల్లో 105 మందికి పూర్తిగా తొలగింపు

151 మంది వీఐపీల్లో 105 మందికి పూర్తిగా తొలగింపు

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో 151 మంది వీఐపీలు భారీ భద్రత పొందుతున్నారు. వీరిలో 46 మందికి భద్రతను తగ్గించారు. మిగిలిన 105 మందికి పూర్తిగా భద్రతను తొలగించారు.

వారిని సామాన్యుల రక్షణ కోసం..

వారిని సామాన్యుల రక్షణ కోసం..

ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. భద్రతను కలిగి ఉండటం సామాజిక హోదాగా భావిస్తున్నారని, వీరికి భద్రతను కల్పిస్తున్న సిబ్బందిని సామాన్యుల రక్షణ కోసం వినియోగించాలన్నారు.

వీరికి పూర్తిగా తొలగింపు

వీరికి పూర్తిగా తొలగింపు

పూర్తి భద్రత తొలగించబడిన వారిలో బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మిశ్రా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సెక్యూరిటీ పొందుతున్నారు.

మాజీ చీఫ్ సెక్రటరీ అలోక్ రంజన్‌కు కూడా భద్రతను తొలగించారు. అలాగే, ఇద్దరు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్సీలు అయిన అషు మాలిక్, అతుల్ ప్రదాన్‌లకు కూడా సెక్యూరిటీ తీసేశారు.

English summary
In a sudden move, Uttar Pradesh government took away or downgraded security cover of several opposition leaders, including former chief ministers Mulayam Singh Yadav, Akhilesh Yadav and Mayawati and Samajwadi Party MPs Dimple Yadav and Ram Gopal Yadav and SP leaders like Shivpal Yadav and Azam Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X