75 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు, రికార్డు సృష్టించిన ఆ ప్రభుత్వం
ఉత్తర్ ప్రదేశ్‌లో 75 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్ చాలా తక్కువ సమయంలో ఇచ్చి యోగి సర్కార్ రికార్డు నెలకొల్పింది.
లక్నో: భారత్‌లో ఇప్పటికీ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదనే విమర్శ ఇంకా ఉంది. వేసవి వస్తే చాలు బావులు, చెరువులు, నదులు ఎండిపోయే పరిస్థితి ఉంది. దీంతో తాగునీరు కోసం కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఉంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అతి తక్కువ సమయంలోనే లక్షల ఇళ్లకు యోగీ సర్కార్ తాగునీటి కనెక్షన్ అందించింది.ఇది విజయవంతం కావడంతో యోగీ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఇక ప్రతి ఇంటికీ తాగు నీరు అందాలన్న మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించింది. 2024నాటికల్లా గ్రామీణ భారతంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.ఇప్పటికే కొన్ని కోట్ల ఇళ్లకు మంచినీటి పైపు కనెక్షన్‌లు ఇచ్చారు. ఇక గణాంకాలు చూస్తే ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే 75 లక్షలకు పైగా నల్లా కనెక్షన్‌లు యోగీ ప్రభుత్వం ఇచ్చింది.75 లక్షల నీటి కనెక్షన్‌ల లక్ష్యాన్ని దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే అందుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అందుకోవడంతో దీన్ని పురస్కరించుకుని యోగీ సర్కార్ హర్ ఖర్ జల్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ ప్రాజెక్టు సక్సెస్ వెనక ఉన్న పలువురు ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగస్తులను సన్మానించింది. అంతేకాదు జల్ జీవన్ ప్రాజెక్టు ప్రారంభించి రెండేళ్లు పూర్తి కావొస్తుండటంతో దీనికి సంబంధించి ఒక సినిమా కూడా తెరకెక్కింది.ఉత్తర్ ప్రదేశ్ సాధించిన విజయాలను కూడా ఈ-బుక్ రూపంలో ప్రచురించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకప్పుడు తాగునీరు లేక విలవిలలాడిని బుందేల్ ఖండ్ లాంటి ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని ప్రభుత్వం నల్లా కనెక్షన్ ద్వారా అందిస్తోంది.ఇక మిగతా ప్రాంతాలైన తూర్పు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా తాగునీరు అందించేందుకు పైపులైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యధిక గ్రామాలు ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ నీటి కనెక్షన్‌లు ఇచ్చి యోగీ సర్కార్ రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications