మీరు సూటుబూటు వేసుకున్న వారికే కాపలాదారుడు: మోడీకి కాంగ్రెస్ కౌంటర్

Recommended Video

    మోదీ చౌకీదార్ ట్వీట్ కు చురకలంటించిన కాంగ్రెస్ ! | Oneindia Telugu

    ఎన్నికల వేళ అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగ సభల్లో ఒక పార్టీపై మరొక పార్టీ నిప్పులు చెరుగుతుండగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నెటిజెన్లు కూడా తమకు తోచినట్లుగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య గతకొన్ని రోజులుగా ట్విటర్ వార్ నడుస్తోంది.

    "మై భీ చౌకీదార్" అనే ఆన్‌లైన్ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇండియా బెవకూఫ్ నహిహే, సూట్‌బూట్ కా చౌకీదార్ అంటూ ట్విటర్‌లో హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేసింది. అంటే ప్రధాని మోడీ తాను భారత్‌కు వాచ్‌మెన్ అని చెప్పడంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. భారతదేశంలోని ప్రజలు నమ్మేందుకు అమాయకులు కాదని మోడీ కేవలం సూటు బూటు వేసుకున్న వారికి మాత్రమే కాపలాదారుడని కౌంటర్‌కు దిగింది. ఇక ప్రధాని మోడీ అనిల్ అంబానీ, గౌతమ్ అదానీల బాగుకోసమే కృషి చేశారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించింది.

    ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం మరో అడుగు ముందుకేసి అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యలతో మోడీ ఉన్న ఫోటోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం ప్రధాని మోడీ ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో ప్రజలు నేను కూడా దేశానికి కాపలాదారుడునని చెబుతున్నట్లుగా ఉంది. గతంలో ప్రధాని చెప్పిన విషయాలను మరోసారి వినిపించారు. దేశానికి తాను కాపలాదారుడిగా ఉంటానని, ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు.

    You are Suit Boot Ka Chowkidaar: Congress slams PM Narendra Modis latest online campaign

    అంతేకాదు అవినీతిపై పోరాటం చేస్తామని కూడా చెప్పారు.ఉగ్రవాదాన్ని దేశంనుంచి తరిమి కొడతామని మోడీ చెప్పారు. మోడీ చెప్పిన మాటలను కాంగ్రెస్ విమర్శలతో తిప్పికొడుతోంది. కేవలం సూటు బూటు వేసుకున్నవారికి మాత్రమే మోడీ కాపలాదారుడిగా ఉన్నారని... ఇక అవినీతి విషయానికొస్తే మోడీ రాఫెల్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+