Post Office Scheme: ఈ పథకంలో చేరితే నెలనెలా రూ.5, 550 ఆదాయం పొందవచ్చు..!
దాదాపు అందరు సంపాదిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రమే పొదుపు చేస్తుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పొదుపు చేయాలా చాలా మందికి తెలియదు. అయితే కచ్చితమైన రాబడితో సురక్షితమైన పెట్టుబడి పథకాలు అంటే.. అవి పోస్టాఫీస్ పథకాలుగా చెప్పుకోవచ్చు. కచ్చితమైన రాబడి, సురక్షితమైన పెట్టుబడి పథఖాల్లో పోస్టాఫీస్ మంత్లి ఇన్ కమ్ పథకం(MIS) ఒకటి.
సురక్షితమైన పెట్టుబడితో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకొనేవారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టి నెలనెలా కొంత సొమ్మును పొందవచ్చు. దీంతో వృద్ధుల అవసరాలు తీరుతాయి. ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు నెలవారీ డబ్బులు పొందవచ్చు.

మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి వడ్డితో కలిపి మీకు నెలనెలా చెల్లిస్తారు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతాను తెరవాలంటే భారతీ పౌరుడై ఉండాలి. ఈ ఖాతాను ఒక్కరిగా తీసుకోవచ్చు లేదా జంటగా కూడా తీసుకోవచ్చు. గరిష్ఠంగా ముగ్గురు ఖాతాను తెరవొచ్చు. చిన్న పిల్లల పేరుపై కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ ఖాతా కూడా ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి.
ఈ పథకంలో గరిష్టంగా అంటే వ్యక్తిగత ఖాతలో రూ. 9 లక్షలు.. ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మీరు ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు నెలకు రూ.5, 550 ఐదేళ్ల పాటు వస్తాయి.












Click it and Unblock the Notifications