delhi clashes: ఆదేశాల కోసం చూడొద్దు, విధులు నిర్వర్తించడమే ఫస్ట్ ప్రయారిటీ, ఢిల్లీ అల్లర్లపై HC
ఈశాన్య ఢిల్లీలో జరుగుతోన్న ఘర్షణలకు సంబంధించి పిటిషన్ హస్తిన హైకోర్టు విచారణ చేపట్టింది. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్ సహా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలసిందే. పరిస్థితి చేయిదాటినప్పుడు కోర్టు ఆదేశాల కోసం ఎందుకు చూడటం.. వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అని పోలీసులను ప్రశ్నించింది. ఆలస్యం చేయడంతో హింస ఎక్కువవుతుందనే ఉద్దేశంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. వారికి పరీక్షలు ఎప్పుడూ నిర్వహిస్తారనే అంశంపై 15 రోజుల్లో తెలియజేయాలని ఢిల్లీ విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో అల్లర్లతోపాటు న్యాయ విచారణ జరపాలని, ఆర్మీ మొహరింపు, బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

ఎన్జీవో మానవ హక్కుల లా నెట్‌వర్క్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించనుంది. పిటిషన్ విచారణ సందర్భంగా హాజరయ్యే అవకాశం ఉందని హైకోర్టు ధర్మాసనానికి లాయర్ తెలియజేశారు.
ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది చనిపోగా.. బుధవారం మరో ఏడుగురు చనిపోయారు. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గానికి ఢిల్లీ పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించనున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications