ఇక నిమిషాల్లోనే పాన్ నంబర్, పన్ను చెల్లింపుల కోసం ప్రత్యేక యాప్
ఇకమీదట దరఖాస్తు చేసిన నిమిషాల్లోనే పాన్ నంబర్ మీ చేతికి అందనుంది. అంతేకాదు.. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా తక్షణ పన్ను చెల్లింపులు చేసే విధానం కూడా త్వరలోనే అందుబాటులోనికి రానుంది.
న్యూఢిల్లీ: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కావాలంటే ఇన్నళ్లూ కొన్ని వారాలు పట్టేది. ఇకమీదట దరఖాస్తు చేసిన నిమిషాల్లోనే పాన్ నంబర్ మీ చేతికి అందనుంది. అంతేకాదు.. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా తక్షణ పన్ను చెల్లింపులు చేసే విధానం కూడా త్వరలోనే అందుబాటులోనికి రానుంది.
పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆధార్ ఇ-కేవైసీ సౌకర్యం ఆధారంగా పాన్ జారీ చేయాలని యోచిస్తోంది. వేలిముద్ర ఆధారంగా పని చేసే బయోమెట్రిక్ విధానంతో ఇ-కేవైసీ విధానం పనిచేస్తుంది.

ఇ-కేవైసీ ద్వారా సిమ్ కార్డు జారీ చేసిన మాదిరిగానే పాన్ కూడా జారీ చేయనున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే పాన్ కార్డు జారీ ప్రక్రియ ఇకమీదట అయిదారు నిమిషాల్లోనే పూర్తికానుంది. ఈ విధానంలో పాన్ తక్షణమే లభిస్తుంది, కార్డు తరువాత చేతికందుతుంది.
అలాగే ఆదాయపన్ను శాఖ ఆన్ లైన్ లో పన్ను చెల్లించే విధంగా ఓ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ యాప్ ద్వారా పన్ను చెల్లింపులే కాకుండా పాన్ కి దరఖాస్తు చేయడం, రిటర్న్ లు ట్రాక్ చేసుకునే వీలు కూడా కలుగుతుంది.












Click it and Unblock the Notifications