నిత్యం యువతిని ఇంటికి తీసుకెళ్లి రాసలీలలు: స్థానిక మహిళలు పట్టుకుని ఏం చేశారంటే !
ప్రతిరోజూ అమ్మాయిని ఇంటికి తీసుకుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు సహనం కోల్పోయిన స్థానిక మహిళలు పట్టుకుని చితకబాదేసి, విద్యుత్ స్థాంభానికి కట్టేసి ?
బెంగళూరు: బంధువుల ఇంటికి అమ్మాయిని తీసుకెళ్లి నిత్యం రాసలీలు జరుపుతూ ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాదేశారు. విద్యుత్ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేసిన ఘటన కర్ణాటకలోని కోప్పళ పట్టణంలో జరిగింది.
కోప్పళలోని దేవరాజ్ అరసు కాలనీలో ఆసీఫ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను కోప్పళలోని కవలూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతిని ప్రతి రోజు దేవరాజ్ అరసు కాలనీలోని బంధువుల ఇంటికి తీసుకు వస్తున్నాడు.

చాలకాలం నుంచి ఈ తతంగం జరుగుతోంది. ప్రతి రోజు యువతిని తీసుకురావడం, గంటలకొద్ది ఇంటిలో తలుపులు వేసుకుని రాసలీలు జరుపుతూ ఆసీఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలు, యువతులు ఇతని ప్రవర్తనతో విసిగిపోయారు.
శనివారం ఆసీఫ్ యువతిని తీసుకుని బంధువుల ఇంటి దగ్గరకు వెళ్లాడు. అంతే సహనం కోల్పోయిన స్థానికులు ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ఆసీఫ్ ను ప్రశ్నించారు. నాఇష్టం మీరు ఎవరు అడగడానికి అని ఆసీఫ్ ఎదురుతిరిగాడు. స్థానిక మహిళలు ఆసీఫ్ ను పట్టుకుని చితకబాదేసి విద్యుత్ స్థంభానికి కట్టేశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసీఫ్ ను అప్పగించారు












Click it and Unblock the Notifications