ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు డ్యాన్స్ టీచర్ హత్య
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు ఓ 19ఏళ్ల డ్యాన్స్ టీచర్‌ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ చదువుతున్న సుమిత్ గొరాయ్ అనే యువకుడు పిల్లలకు డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాడు. మంగళవారం తన దగ్గర డ్యాన్స్ నేర్చుకునే ఓ విద్యార్థినిని శాంతినగర్‌లో ఆమె ఇంటి దగ్గర దింపుతుండగా ఓ వ్యక్తి బైకుపై వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు.
గమనించిన స్థానికులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుమిత్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

కాగా, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితుడు రెండో రోజులుగా ఓ విద్యార్థినిని వేధిస్తుండటంతో డ్యాన్స్ టీచర్ అడ్డుకున్నాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తగాదా వచ్చిందని తేలింది.
ఈ నేపథ్యంలోనే నిందితుడు సుమిత్‌ను కాల్చి చంపాడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications