పోలీసు కస్టడీకి నలుగురు స్త్రీలతో పాటు సినీ హీరో, ఇద్దరు మోడల్స్
హైదరాబాద్: మలయాళ సినిమా నటుడు షినే టామ్ చాకో తో పాటు నలుగురు మహిళలను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అప్పగించింది. విచారణ కోసం ఈ నెల 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వారికి పోలీస్ రిమాండ్ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశించింది.
సినీ నటుడిడతో పాటు అరెస్టు అయిన నలుగురు మహిళల్లో ఇద్దరు మోడల్స్ ఉన్నారు. కొచ్చి లోని ఓ ప్లాట్ లో ఇటీవల షినే టామ్ చాకో తో పాటు నలుగురు మహిళలతో కొకైన్ కొడుతూ పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కేరీర్ ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు.
అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు. వారు పట్టుబడిన ఫ్లాట్ ఓ వ్యాపారవేత్త, కింగ్స్ గ్రూప్ యజమాని ముహమ్మద్ నిజామ్‌కు చెందిందని స్థానిక దినపత్రిక మనోరమ తెలిపింది. కారుతో గుద్ది సెక్యూరిటీ గార్డుపై హత్యాప్రయత్నం ఆరోపణలకు చెందిన కేసులో ఆయనను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చాకోతో పాటు అరెస్టయిన నలుగురు మహిళల్లో అసిస్టెంట్ డైరెక్టర్ బ్లెస్సీ, మోడల్స్ టిన్సీ, రేష్మ, దుబాయ్‌కి చెందిన ట్రావెల్ మార్ట్ యజమాని స్నేహ ఉన్నారు.












Click it and Unblock the Notifications