ఇవే తగ్గించుకుంటే మంచిది.. కాస్త ఉంటే ముగ్గురు ప్రాణాలు గాల్లోనే !
మహీంద్రా థార్ కారుపై ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ యువకులు కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యువకులు సోషల్ మీడియా కోసం స్టంట్స్ చేస్తూ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..?
హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో ముగ్గురు యువకులు మహీంద్రా థార్ వాహనంపై కూర్చుని ప్రయాణిస్తున్నారు. అయితే ఎదురుగా లారీ రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారుపై ఉన్న యువకులు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. ఆ సమయంలోనే కారు డ్రైవర్, లారీ డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవహరించి.. బ్రేక్స్ వేయడంతో వారు టైర్ల కింద పడకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.

అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఈ వీడియో హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వేగంగా వైరల్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు యువకుల బాధ్యతారహిత వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. "ప్రాణాలతో ఆడుకోవడం ఎందుకు?" "యంగ్‌స్టర్స్‌కు రోడ్డు సేఫ్టీ అవగాహన అసలు ఉందా?" అంటూ అనేక కామెంట్లు వస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్లపై ఇలాంటి విన్యాసాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తరహా స్టంట్స్ భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని కూడా వెల్లడించారు. అంతే కాకుండా మోడిఫైడ్ వాహనాలను ప్రత్యేకంగా ట్రాక్ చేయాలని ట్రాఫిక్ శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. పాఠశాలలు, కాలేజీలు, వాహన షోరూములు, డ్రైవింగ్ స్కూల్స్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
🚨Thar wale Chapri: Truck driver immediately applied brakes, Otherwise, the entire fault would have been the truck driver's, Who knows what people would have done to that driver, accident could have been bigger, People risk lives just to make a reel.pic.twitter.com/sWYHZ7VeBA
— Deadly Kalesh (@Deadlykalesh) November 20, 2025












Click it and Unblock the Notifications