తండ్రితో ఇష్యూ.. నాలుగేళ్ల బాలుడిని నేలకేసి విసిరికొడుతూ దాడి !!
ముంబై సమీపంలోని వసాయిలో స్వల్ప వివాదం కారణంగా నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన కిరాతక దాడి స్థానికంగా కలకలం రేపింది. బాలుడి తండ్రితో గొడవపడిన తర్వాత.. ఒక వ్యక్తి ఆ చిన్నారిపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది. చిన్నపిల్లాడు అన్న కనికరం లేకుండా ప్రవర్తించడం సభ్యసమాజాన్ని కలచివేసింది.
ఈ హృదయ విదారక సంఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం, నిందితుడు సందీప్ పవార్ చిన్న విషయమై బాలుడి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేక, అక్కడే పసుపు రంగు టీ-షర్ట్‌లో ఆటో-రిక్షాలో ఆడుకుంటున్న నాలుగేళ్ల విఘ్నేష్‌పై అత్యంత క్రూరంగా దాడి చేశాడు.

సందీప్, బాలుడి కాళ్లు పట్టుకుని ఆటోలోంచి కిందకు లాగి, నేలపై విసిరేశాడు. అంతటితో ఆగకుండా, చిన్నారిని భవనం లోపలికి లాక్కెళ్లి, అతని తలను ఇనుప రాడ్‌కు అనేకసార్లు కొట్టి, తిరిగి నేలకేసి పడేశాడు. ఈ కిరాతక చర్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది, మానవత్వం లేని ఈ దాడి తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
తీవ్ర గాయాలతో విఘ్నేష్‌ను వెంటనే మీరా రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల ప్రకారం అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడు సందీప్ పవార్‌ను అరెస్టు చేసి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
खतरनाक वीडियो है
— Ranvijay Singh (@ranvijaylive) March 31, 2026
4 साल के बच्चे को उठाकर जमीन पर पटक दिया.
ये महाराष्ट्र के वसई का वीडियो है. बच्चे को जमीन पर पटकने वाले का नाम संदीप पवार है.
संदीप का बच्चे के पिता से विवाद चल रहा था, उसी दुश्मनी में ऐसा किया.
बच्चा अस्पताल में भर्ती है, संदीप को पुलिस ने पकड़ लिया. pic.twitter.com/4TS9GnDEDl












Click it and Unblock the Notifications