Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: గర్బిణితో సహ ఒకే ఫ్యామిలీలో ముగ్గురి ప్రాణం తీసిన లవ్ మ్యారేజ్, కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి ?

బెంగళూరు/హావేరి: దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు ఓ అమ్మాయిని చూసి కొంతకాలం క్రితం పెద్ద కుమారుడికి వివాహం చేశారు. వివాహం చేసుకున్న నవ దంపతులు సంతోషం కాపురం చేస్తున్నారు. భార్య ప్రస్తుతం గర్బవతి. ఇంటిలో జరిగిన లవ్ మ్యాటర్ విషయంలో ఆవేదన చెందిన నవదంపతులు, యువకుడి తల్లి ఒకేసారి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోవడంతో అతని కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం. వారిలో గర్బిణి కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొనింది.

కొన్ని నెలల క్రితం అన్న పెళ్లి

కొన్ని నెలల క్రితం అన్న పెళ్లి

కర్ణాటకలోని హావేరి సమీపంలోని అగడి గ్రామంలో విరుపాక్షప్ప, లలితా దంపతులు నివాసం ఉంటున్నారు. విరుపాక్షప్ప, లలితా దంపతులకు కిరణ్ (22), అరుణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం విరుపాక్షప్ప, లలితా దంపతులు వారి పెద్ద కుమారుడు కిరణ్ కు సౌజన్యా (21) అనే యువతితో వివాహం జరిపించారు.

యువతిని ప్రేమిస్తున్న తమ్ముడు

యువతిని ప్రేమిస్తున్న తమ్ముడు

వివాహం చేసుకున్న కిరణ్, సౌంజన్యా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సౌజన్యా ప్రస్తుతం నాలుగు నెలల గర్బవతి. విరుపాక్షప్ప, లలితల చిన్న కుమారుడు అరుణ్ అతను నివాసం ఉంటున్న గ్రామంలోనే ఉంటున్న యువతిని ప్రేమించాడు. అన్న కిరణ్ కు పెళ్లి జరిగిపోవడంతో తన రూట్ క్లియర్ అయ్యిందని అరుణ్ అనుకున్నాడు.

ప్రియురాలితో జంప్

ప్రియురాలితో జంప్

ఇదే నెల 19వ తేదీన అరుణ్ అతను ప్రేమించిన యువతితో కలిసి ఊరు వదిలి పారిపోయాడు. హరిహరకు పారిపోయిన అరుణ్ అతని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు అరుణ్ ఇంటికి వెళ్లి అతని అన్న కిరణ్, అతని భార్య సౌజన్యా, అరుణ్ తల్లి లలితాను కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు రహస్య ప్రాంతంలో పెట్టి అరుణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని వారిని టార్చర్ పెట్టారని తెలిసింది.

తల్లి, కొడుకు, కోడలు కిడ్నాప్

తల్లి, కొడుకు, కోడలు కిడ్నాప్

గురువారం సాయంత్రం కిడ్నాప్ చేసిన లలితా. ఆమె కుమారుడు కిరణ్, కోడలు సౌజన్యాను కారులో పిలుచుకుని వాళ్ల ఇంటి దగ్గర వదిలిన ప్రియురాలి కుటుంబ సభ్యులు మర్యాదగా అరుణ్, మా అమ్మాయిని పట్టుకుని అప్పగించకపోతే మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామని యువతి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు.

ఒకే ఇంటిలో ముగ్గురి ఆత్మహత్య

ఒకే ఇంటిలో ముగ్గురి ఆత్మహత్య

అరుణ్ యువతితో పారిపోవడం, ఆమె కుటుంబ సభ్యులు కేసు పెడుతామని బెదిరించడంతో లలిత, ఆమె కొడుకు కిరణ్. కోడలు సౌజన్యా ఆవేదన చెందారు. భర్త విరుపాక్షప్ప బయటకు వెళ్లిన తరువాత అతని భార్య లలిత, కొడుకు కిరణ్, కోడలు సౌజన్యా ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

లవ్ మ్యారేజ్ ముగ్గురి ప్రాణం తీసింది

లవ్ మ్యారేజ్ ముగ్గురి ప్రాణం తీసింది

నా భార్య లలిత, కొడుకు కిరణ్, కోడలు సౌజన్యా ఆత్మహత్యలకు నాగరాజ్, దర్శన్, ప్రకాష్, శశిధర్, సచిన్, పరమేశ్వర కారణం అని విరుపాక్షప్ప కేసు పెట్టాడని, నిందితుల కోసం గాలిస్తున్నామని హావేరీ గ్రామీణ పోలీసులు అన్నారు. యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోవడంతో అతని కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం. వారిలో గర్బిణి కూడా ఉండటంతో హావేరీలో విషాదం నెలకొనింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+