" నాపై క్యాన్సరే గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి "
అతడు ఎన్నో కలలు కన్నాడు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడపాలని ఆశలు పెట్టుకున్నాడు. జీవితంపై ఎంతో ఊహించాడు. కానీ వాటన్నింటినీ క్యాన్సర్ భూతం చెరిపేసింది. చిన్న వయసులోనే తన కలల్ని ఛిద్రం చేసింది. నిండా పాతికేళ్లు కూడా లేని ఆ యువకుడ్ని చావు చివరి వరకు తీసుకొచ్చింది. ఆ బాధ, వేదనతో పోస్టు పెట్టాడు ఆ యువకుడు.. నాపై క్యాన్సరే గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి.. అని రాసుకొచ్చాడు. ఆ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ 21 ఏళ్ల యువకుడు సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. 2023లో ఆ యువకుడికి పెద్దపేగు క్యాన్సర్ స్టేజ్-4 అని నిర్ధారణ అయింది. డాక్టర్లు కీమోథెరపీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బతకడని తేల్చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన ఆ యువకుడు Reddit వేదికగా పోస్టు పెట్టాడు. ఇదే నాకు చివరి దీపావళి అని ఎమోషనల్ అయ్యాడు. ఈ దీపాల వెలుగులు, ఈ ఆనందం మళ్లీ చూడకపోవచ్చని పోస్టులో పేర్కొన్నారు.
Cancer won guys , see ya !!!
byu/Erectile7dysfunction inTwentiesIndia
క్యాన్సర్ ముదరడంతో వైద్యులు చేయాల్సింది అంతా చేశారు. ఇక వైద్య చికిత్స కూడా ఆపేశారు. ఇక సంవత్సరం లోపే అతడి మరణం అని తేల్చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువకుడు ఇదే నాకు చివరి దీపావళి.. ఇవే నా జీవితంలో చివరి వెలుగులు అని ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. " దీపావళి వస్తోంది. వీధుల్లో ఇప్పటికే లైట్లు వెలుగుతున్నాయి. ఈ వెలుగులను చూడడం నాకు ఇదే చివరిసారి. ఇది బాధగా ఉంది. నేను ఈ వెలుగులు, ఆనందం, శబ్దాలను మిస్ అవుతాను. జీవితం చివరిదశకు వెళ్తుంటే ఏదో తెలియని కొత్తగా అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం ఎవరోఒకరు నా ముందు ఇలానే దీపం పెడతారు. నేను ఓ జ్ఞాపకంలా మిగిలిపోతాను" అని ఆ యువకుడు పోస్టులో పేర్కొన్నాడు.

" నా సమయం అయిపోతుంది. నా కోరికలు, ఆలోచనలు రూపుమారుతున్నాయి. నేను ఇంట్లో ఉన్నాను. వారి కళ్లలో బాధ కనబడుతోంది. నేను ఇది ఎందుకు పోస్టు చేస్తున్నానో కూడా తెలియదు. మీకు చెప్పడానికే అనుకుంటా.. నేను పూర్తిగా కనుమరుగయ్యే లోపు నా మాటలు ఇవే అనుకుంటా" అంటూ ఆ యువకుడు ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్టుపై వేల మంది బాధతో కామెంట్స్ పెడుతున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అని దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేవుడు నీకు కొత్త లైఫ్ ఇస్తాడు.. ప్రేయర్ చేసుకో అని కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications