ప్రేమ, పెళ్లి పేరుతో ఎంజాయ్, బిడ్డ తల్లిని చేసిన కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగం వస్తోందని రివర్స్, ఆడియో

చెన్నై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా శారీరక సంబంధం కొనసాగించి ఓ బిడ్డ పుట్టిన తరువాత తాను త్వరలో ఎస్ఐ కాబోతున్నానని, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదని కానిస్టేబుల్ తనను మోసం చేశాడని బాధితురాలు చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. తాను, కానిస్టేబుల్ కలిసి తిరుగుతున్న విషయం అతని ఇంటిలో తెలుసని, ఇప్పుడు తన కుమారుడు ఎస్ఐ కాబోతున్నాడని, వేరే యువతితో పెళ్లి చేస్తామని అతని తల్లి కూడా తనను మోసం చేసిందని, తనకు న్యాయం చెయ్యాలని బాధిత మహిళ ఆరోపిస్తున్నది.

జిమ్ కు వెలుతుంటే !

జిమ్ కు వెలుతుంటే !

చెన్నైలో సరస్వతి (24) అనే మహిళ నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరమణి అనే యువకుడు 2017లో జిమ్ కు వెళ్లే సమయంలో అక్కడ అతనికి సరస్వతి పరిచయం అయ్యింది. తరువాత వీరమణి, సరస్వతి స్నేహితులు అయ్యారు.

ప్రేమికుల విహారయాత్రలు

ప్రేమికుల విహారయాత్రలు

వీరమణి, సరస్వతి స్నేహం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కలిసి విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగారు. అదే సమయంలో ప్రతిరోజు జిమ్ కు వెళ్లి, వ్యాయామం చేస్తున్న వీరమణికి చెన్నైలో పోలీసు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని ఇక పెళ్లి చేసుకుందామని వీరమణి సరస్వతికి చెప్పాడని తెలిసింది.

మా ఇంటికి రా మాట్లాడుకుందాం !

మా ఇంటికి రా మాట్లాడుకుందాం !

2018 మే 27వ తేదీ తన ఇంటికి వస్తే తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని, తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటానని వీరమణి చెప్పాడని సమాచారం. తరువాత తాను వీరమణి ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో ఇంటిలో ఎవ్వరూ లేరని, మా తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్లారని వీరమణి చెప్పాడని తెలిసింది.

పెళ్లి ముసుగులో అత్యాచారం ?

పెళ్లి ముసుగులో అత్యాచారం ?

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వీరమణి తన మీద బలవంతంగా అత్యాచారం చేశాడని సరస్వతి ఆరోపిస్తోంది. అప్పటి నుంచి తనతో బలవంతంగా శారీరక లైంగికవాంచ తీర్చుకుంటున్నాడని, ఇప్పుడు బిడ్డ పుట్టిన తరువాత తాను వేరే మహిళను వివాహం చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకోనని వీరమణి ఎదురుతిరిగాడని సరస్వతి ఆరోపించింది.

ఎస్ఐ ఉద్యోగం వస్తోంది !

ఎస్ఐ ఉద్యోగం వస్తోంది !

పోలీసు ఉద్యోగం చేస్తున్న వీరమణి త్వరలో జరుగనున్న ఎస్ఐ ఉద్యోగ పరీక్షలు రాయడానికి సిద్దం అవుతున్నాడు. తాను వీరమణి తల్లిని కలిసి జరిగిన విషయం పూర్తిగా చెప్పానని, మా ఇల్లు చిన్నదిగా ఉందని, కొంతకాలం నువ్వు మీ ఇంటిలో ఉంటే తరువాత వేరే ఇల్లు చూసి నిన్ను అక్కడికి పిలుచుకుంటానని చెప్పిందని సరస్వతి పోలీసు అధికారులకు చెప్పింది.

ఏం చేసుకుంటావో చేసుకో !

ఏం చేసుకుంటావో చేసుకో !

తన కుమారుడు త్వరలో ఎస్ఐగా ఉద్యోగంలో చేరుతున్నాడని, వేరే అమ్మాయితో పెళ్లి చెయ్యడానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, నీదారి నువ్వు చూసుకో అంటూ అతని తల్లి బెదిరించిందని సరస్వతి పోలీసులకు చెప్పింది. నిన్ను వివాహం చేసుకోను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వీరమణి ఎదురు తిరిగాడని సరస్వతి చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.

కమిషనర్ చేతికి ఆడియో టేప్

కమిషనర్ చేతికి ఆడియో టేప్

తనను వివాహం చేసుకోవాలని ఫోన్ చేసి వేడుకుంటున్న సమయంలో నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ వీరమణి సమాధానం ఇచ్చాడని, ఆ సమయంలో అతని మాటలు తాను మొబైల్ లో రికార్డు చేశానని, మీరు ఆడియోలోని మాటలు విని తనకు న్యాయం చెయ్యాలని సరస్వతి ఓ ఆడియో టేప్ ను చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు అందించారు. అయితే వీరమణిని తాము ఇంకా అరెస్టు చెయ్యలేదని, అతన్ని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+