నవ వివాహిత దగ్గర అర్ద కేజీ బంగారు నగలు, అక్రమ సంబంధం, ఆంబూర్ చికెన్ బిరియాని, అడవిలో ఫినిష్ !

చెన్నై: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న సుమారు 8 సవర్లు బంగారు నగలు లూటీ చేశారు. చికెన్ బిరియాని తీసిస్తామని మహిళను పిలుచుకుని వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేసి ఆమె బంగారు నగలు లూటీ చేసిన మహిళను, ఆమె ప్రియుడిని తమిళనాడులోని ఆంబూర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రేమ జంట బయట ప్రాంతానికి వెళ్లి జీవించాలని ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

భర్తను వదిలేసిన మహిళ

భర్తను వదిలేసిన మహిళ

ఆంబూర్ సమీపంలోని అరంగల్ దుర్గంలోని సుద్దగుంట ప్రాంతానికి చెందిన రేవతి (24), పోచంపల్లికి చెందిన రాజు అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. తరువాత రేవతి, రాజు దంపతుల మధ్య గొడవలు రావడం మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి రేవతి భర్త రాజును వదిలేసింది.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

భర్తను వదిలేసిన రేవతి తరువాత మహేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. మహేష్, రేవతి ఒకరిని ఒకరు ఉండలేమని నిర్ణయించారు. మూడు నెలల క్రితమే ప్రియుడు మహేష్ ను రేవతి రెండో పెళ్లి చేసుకుంది. మహేష్ ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మహేష్, రేవతి దంపతులు బెంగళూరులో కాపురం పెట్టారు.

 భారీగా బంగారు నగలు

భారీగా బంగారు నగలు

తనతో ఎంతో ప్రేమగా ఉంటున్న భార్య రేవతికి ఆమె భర్త మహేష్ సుమారు 8 సవర్ల బంగారు నగలు చేయించాడు. మూడు నెలల నుంచి భర్త మహేష్ తో బెంగళూరులోనే ఉంటున్న రేవతి సొంత ఊరి వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఎందుకో ఒకసారి సొంత ఊరికి వెళ్లి రావాలని రేవతి నిర్ణయించింది. ఈనెల 18వ తేదీన రేవతి సొంత ఊరు సుద్దగుంటకు వెళ్లింది.

 అక్రమ సంబంధంతో ప్రేమ జంట పరార్

అక్రమ సంబంధంతో ప్రేమ జంట పరార్

రేవతి బంధువు సెల్వరాజ్ ఆంబూరులో టైలర్ గా పని చేస్తున్నాడు. సెల్వరాజ్ పని చేస్తున్న చోట చిత్రా (34) అనే మహిళ టైలర్ గా పని చేస్తోంది. సెల్వరాజ్, చిత్రాలకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. సెల్వరాజ్ తో కలిసి చిత్రా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. చివరికి భర్తను వదిలేసిన చిత్రా సెల్వరాజ్ తో కలిసి లేచిపోయింది.

రేవతి ఇంటి పక్కనే లవర్స్ కాపురం

రేవతి ఇంటి పక్కనే లవర్స్ కాపురం

చిత్రాను పిలుచుకుని వచ్చిన సెల్వరాజ్ సుద్దగుంటలోని రేవతి నివాసం ఉంటున్న ఇంటి పక్కనే కాపురం పెట్టాడు. రేవతి దగ్గర బంగారు నగలు ఎక్కువ ఉన్న విషయం చిత్రా కింటిలో పడింది. తన ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి విలాసవంతమైన జీవితం గడపాలంటే రేవతి దగ్గర ఉన్న బంగారు నగలు లూటీ చెయ్యాలని చిత్రా నిర్ణయించింది.

అటవి ప్రాంతంలో శవం

అటవి ప్రాంతంలో శవం

రేవతితో పరిచయం పెంచుకున్న చిత్రా ఆమెతో ఎక్కువగా చనువుగా ఉండేది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేవతి సుద్దగుంట సమీపంలోని అటవి ప్రాంతంలో శవమై కనిపించింది. రేవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రేవతి దగ్గర ఉన్న బంగారు నగలు, ఆమె సెల్ ఫోన్ మాయం అయిన విషయం పోలీసులు గుర్తించారు.

 ఆంబూర్ చికెన్ బిరియాని తినిపిస్తాం రా !

ఆంబూర్ చికెన్ బిరియాని తినిపిస్తాం రా !

రేవతి మాయం అయిన రోజు చివరిగా చిత్రా మొబైల్ నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని పోలీసులు గుర్తించారు. చిత్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. ఆంబూర్ చికెన్ బిరియాని తినిపిస్తామని రేవతిని నమ్మించి తీసుకెళ్లిన చిత్రా, ఆమె ప్రియుడు సెల్వరాజ్ అటవి ప్రాంతంలో ఆమెను దారుణంగా హత్య చేసి బంగారు నగలు లూటీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేవతిని హత్య చేసిన చిత్రా, ఆమె ప్రియుడు సెల్వరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+