ఆమె కాదు అతడే కిడ్నాప్ చేశారు..అత్యాచారం చేశారు
ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన నోయిడాలో చోటుచేసుకొంది. ఈ ఘటన సంచలనం కల్గించింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆ యువకుడిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జర
నోయిడా : యువకుడిని కిడ్నాప్ చేశారు. డబ్బులు డిమాండ్ చేయలేదు. ఏకంగా ఈ యువకుడిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన సంచలనం కల్గించింది.నిందిులు ఎవరో గుర్తించలేదని పోలీసులు చెప్పారు. పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు.
నోయిడాలోని సెక్టార్ 63 లో పనిచేస్తోన్న బాధితుడు శనివారం నాడు పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ణి కిడ్నాప్ చేశారు.
ఓ గదిలొకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు.

యువతులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం లాంటి వార్తలు వింటుంటాం.కాని, అందుకు భిన్నమైన ఘటన నోయిడాలో చోటుచేసుకొంది. ఈ ఘటన డిల్లీలో సంచలనం కల్గించింది.యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం అసాధారణమైందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భాదితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. లైంగికి దాడికి గురి కావడంతో బాధితుడు స్పహ కోల్పోయాడు.స్పహా వచ్చిన తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications