ముద్దు ఇస్తావా..? హగ్ ఇస్తావా..? ఆ మంత్రికి పాతికేళ్ల కుర్రాడు మెసేజ్ లు.. చివరికి

ఆ మహిళా మంత్రి అంటే పాతికేళ్ల కుర్రాడికి పిచ్చి. రోజూ మెసేజ్ లు, వీడియో కాల్స్ చేసేవాడు. అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ ఇబ్బంది పెట్టాడు. నువ్వంటే ఇష్టం అని.. తన కోరిక తీర్చాలని మెసేజ్ లు చేసేవాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబై పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు.

మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్, బీజేపీ నేత పంకజా ముండేకు వేధింపులు అధికమయ్యాయి. ఓ పాతికేళ్ల కుర్రాడు ఆమెను వేధించసాగాడు. ఆమెకు అసభ్య కరమైన మెసేజ్ లు పెడుతూ.. వీడియో కాల్స్ చేసేవాడు. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పుణెకు చెందిన అమోల్ కాలే(25) మంత్రి పంకజా ముండేకు తరచూ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడు. బీజేపీ సోషల్ మీడియా ఫిర్యాదు మేరకు భోసారీ ప్రాంతంలో ఉన్న అమోల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. కోర్టు రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి ఆమోదం తెలిపింది. దీంతో అమోల్ ను పూర్తిస్థాయిలో పోలీసులు విచారించనున్నారు.

Youth Arrested for Harassing Minister Pankaja Munde

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అమోల్ కాలే స్వస్థలం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పార్లీ కాగా.. ప్రస్తుతం అతడు పుణెలో చదువుతున్నాడు. అమోల్ కాలేనే స్వయంగా మహిళా మంత్రికి మెసేజ్ లు పెట్టాడా లేక ఎవరైనా ప్రోత్సహిస్తే అలా చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమోల్ మెసేజ్ లు, కాల్స్ కు మంత్రి పంకజా మొండే డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ముద్దు ఇస్తావా..? హగ్ ఇస్తావా..? అంటూ నిందితుడు మెసేజ్ లు పెట్టినట్లు తేలిందన్నారు. నిందితుడ్ని పలు సెక్షన్ల ఆధారంగా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+