వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్కార్ట్ వెబ్ సైట్: 100 మంది అమ్మాయిల ప్రొఫైల్ పెట్టాడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అందమైన అమ్మాయిల ఫోటోలతో నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నయువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని బక్కర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అఖిలేష్ (24) అనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు.

అందమై అమ్మాయిల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్ తయారు చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టు పంపి వాళ్లతో చాటింగ్ చేస్తున్నాడు. తరువాత మిమ్మల్ని కలవాలని చెబుతాడు. వారు నిరాకరిస్తే వారి మీద కక్ష పెంచుకుంటున్నాడు.

Youth arrested for opening fake Facebook profile of girls in Delhi

వారి ప్రొఫైల్ లో ఉన్న ఫోటోను మార్పింగ్ చేసి నకిలి అకౌంట్ క్రియేట్ చేసి దారుణంగా పెడుతున్నాడు. ఆ అకౌంట్ లు పోర్న్ కంటెంట్ తో నింపేసి ఆ వివరాలను ఎస్కార్ట్ వెబ్ సైట్లలో పెడుతున్నాడు.

నకిలీ ప్రొఫైల్ ను వాళ్లు చదువుతున్న కాలేజ్ లు, స్కూల్ ఫేస్ బుక్ అకౌంట్ లో పెడుతానని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విధంగా 100 అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడి వారిని బ్లాక్ మెయిల్ చేశాడు.

మధ్యప్రదేశ్ లోని భింద్ ప్రాంతానికి చెందిన అఖిలేష్ కు చిన్నప్పటి నుంచి తప్పులు చెయ్యడం అలవాటు. స్కూల్ లో తండ్రి పేరుకు బదులుగా మామ పేరు రాశాడు. డ్రైవింగ్ లైసెన్స్ అలాగే చేశాడు.

10వ తరగతి ఫెయిల్ అయిన అఖిలేష్ ఢిల్లీ చేరుకుని వజీర్ పూర్ లోని ఓ కంపెనీలో పని చేసి అక్కడే డ్రైవర్ అయ్యాడు. ఇతనికి వివాహం అయ్యింది. ఫేస్ బుక్ మెసెంజర్ సాయంతో తన కుమార్తెను వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో అఖిలేష్ బండారం బయటపడింది.

English summary
Accused Akhilesh(24), was arrested from his house in Bakkarwala on August 22. Contact details of 100 girls were recovered from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X