ప్రేమ అంటే ఏమిటో తెలీదు అని చెప్పిన అమ్మాయి గొంతు కోసిన సైకో, మిద్దె మీద ఒంటరిగా ఉంటే !

చెన్నై: ప్రేమను ఒప్పుకోలేదని కసితో ఓ కిరాతకుడు పాఠశాల విద్యార్థిని గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. ఉన్మాధి చేసిన పనికి గొంతు తెగిపోవడంతో ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు కిరాతకుడికి బెండ్ తీసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేవలం 8వ తరగతి విద్యార్థిని తనకు ప్రేమ అంటే ఏమిటో తెలీదు ? అని చెప్పినందుకే మిద్దె మీద ఒంటరిగా ఉన్న ఆమె గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు.

 8వ తరగతి అమ్మాయి

8వ తరగతి అమ్మాయి

చెన్నైలోని అమైందకరై ముత్తుమారియమ్మాన్ కాలనీలోని ఓ భవనం రెండవ అంతస్తులో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది. అమ్మాయి నివాసం ఉంటున్న భవనంలోని కింద అంతస్తులో నిత్యా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

 అమ్మాయిని ప్రేమించాలి !

అమ్మాయిని ప్రేమించాలి !

ఒకే భవనంలో నివాసం ఉంటున్న 8వ తరగతి అమ్మాయికి, నిత్యాకు పరిచయం ఉంది. రోజు అమ్మాయి, నిత్యా పలకరించుకుంటున్నారు. గత కొంత కాలం నుంచి నిత్యా స్కూల్ కు వెలుతున్న అమ్మాయి మీద కన్ను వేశాడు. ఎలాగైన అమ్మాయిని ప్రేమలో పడేయాలని నిత్యా నిర్ణయించాడు.

 ప్రేమ అంటే ఏమిటో తెలీదు !

ప్రేమ అంటే ఏమిటో తెలీదు !

కొన్ని నెలల క్రితం తాను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు నన్ను ప్రేమించాలని నిత్యా 8వ తరగతి అమ్మాయికి చెప్పాడు. అయితే తనకు ప్రేమ అంటే ఏమిటో తెలీదని, నేను బుద్దిగా చదువుకోవాలని, పరీక్షలు దగ్గర పడుతున్నాయని అమ్మాయి సమాధానం ఇచ్చింది. తనకు ప్రేమ అంటే ఏమిటో తెలీదు అని చెప్పిన అమ్మాయి మీద నిత్యా రగిలిపోయాడు.

 చెప్పింది వింటావా ?

చెప్పింది వింటావా ?

ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లుకు తిరిగి ఒకరితో ఒకరు చనువుగా ఉండాలని, అదే ప్రేమ అని నిత్యా ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. అయితే సినిమాలు, షికార్లు తిరగడానికి అమ్మాయి నిరాకరించింది. తాను చెప్పినట్లు వింటావా ? నా చేతిలో చస్తావా ? అంటూ ఇటీవల నిత్యా అమ్మాయిని బెదిరించాడు. అమ్మాయి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిత్యాను నువ్వు బుద్దిగా ఉండాలని, మా అమ్మాయి జోలికి రాకూడదని గట్టిగా హెచ్చరించారు.

ఇంటిలోనే గొంతు కోసిన కసాయి!

ఇంటిలోనే గొంతు కోసిన కసాయి!

గురువారం సాయంత్రం అమ్మాయి తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో అమ్మాయి మాత్రమే ఇంటిలో చదువుకుంటున్నది. విషయం తెలుసుకున్న నిత్యా నేరుగా మిద్దెమీదకు వెళ్లి ఒంటరిగా ఉన్న అమ్మాయి గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

Recommended Video

    Viral Video : Watch How A Woodpecker Saved Babies From Snake | Oneindia Telugu
     తప్పించుకోవడానికి ప్లాన్

    తప్పించుకోవడానికి ప్లాన్

    అమ్మాయి గొంతు కోసిన నిత్యా ఆ ప్రాంతం నుంచి తప్పించుకుని పరారైనాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న అమ్మాయిని కీళప్పాక్కమ్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అన్నానగర్ పోలీసులు నిత్యా కోసం గాలించారు. కోయంబేడు బస్ స్టాండ్ లో వేరే ఊరికి పారిపోవడానికి ప్రయత్నించిన నిత్యాను పట్టుకుని బెండ్ తీసి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరియారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఆమెకు మురుగైన చికిత్స అందిస్తున్నారని అన్నానగర్ పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+