ప్రేయసి సెక్స్‌కు ఒప్పుకున్నా, అతను రేప్ కేసు దోషే

శారీరక సంబంధం పెట్టుకున్న సమయంలో అమ్మాయికి 14 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, దానివల్ల ఆమె అంగీకారంతోనే యువకుడు శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది పరిగణనలోకి రాదని కోర్టు తేల్చి చెప్పింది. అయితే, అపహరణ అభియోగాల నుంచి మాత్రం ఆ యువకుడు సురేందర్ పాశ్వాన్‌కు విముక్తి లభించింది.
అమ్మాయిని అతను బుజ్జగించలేదని, తనతో రావాలని అతను బలవంతపెట్టలేదని, ప్రేమలో పడినందని తన ఇష్టప్రకారమే అమ్మాయి అతనితో 2000 డిసెంబర్ 18వ తేదీన వెళ్లిందని తేలింది. అమ్మాయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అర్థరాత్రి వెళ్లిపోయింది. దాంతో అమ్మాయిని అతను అపహరించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు.
సురేందర్‌కు, అమ్మాయికి మధ్య లైంగిక క్రీడ కూడా అంగీకారంతోనే జరిగింది. అయితే, అమ్మాయి మైనర్ కావడం వల్లనే సురేందర్ దోషిగా తేలాడు. బీహార్‌లో తన గ్రామంలో సురేందర్ తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని అమ్మాయి ఆరోపించడంతో కేసు నడిచింది.
ఇంట్లో అమ్మాయిని కొడుతూ వచ్చారని, దాంతో తనను తీసుకెళ్లాలని అమ్మాయి సురేందర్‌ను అడుగుతూ వచ్చింది. మాట్లాడవద్దని, లేదంటే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications