వాట్సాప్ లో ప్రియురాలితో వీడియో చాటింగ్ చేస్తూ ఆత్మహత్య, ఏందుకంటే?
ప్రేమించిన యువతితో వాట్సాప్ లో వీడియో చాట్ చేస్తూనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో చోటుచేసుకొంది.
భువనేశ్వర్: ప్రేమించిన యువతితో వాట్సాప్ లో వీడియో చాట్ చేస్తూనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో చోటుచేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని పూరీకి చెందిన సైకతరావు అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. గంటలకొద్ది ఫోన్ లో సంభాషణలు, వాట్సాప్ లో వీడియో చాటింగ్ లు చేసేవారు.
కొన్నాళ్ళ క్రితమ ఉన్నత చదువుల కోసం ఆమె కోల్ కత్తా వెళ్ళింది. అప్పటి నుండి ఫోన్ లో ఇద్దరూ టచ్ లో ఉండేవారు. చదువు పూర్తైన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

అయితే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకొన్నాయి. దీంతో సైకతరావు తన ప్రియురాలితో తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం కూడ సైకతరావు, తన లవర్ తో వాట్సాప్ లో వీడియో చాట్ చేస్తున్నాడు. వీడియో చాటింగ్ లోనే ఇధ్దరూ తిట్టుకొన్నారు.
ప్రియురాలు వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానాన్ని సైకతరావు వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. తాను చనిపోతున్నానని , తన చావును కళ్ళారా చూడాలని లవర్ తో చెప్పి ఆమె వీడియో ఛాటింగ్ లో ఉండగానే ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకొని సైకతరావు ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఆ సమయంలో సైకతరావు ఇంట్లో ఎవరూ లేరు. సైకతరావు చావుబతుకుల మధ్య ఉన్నాడని అతడిని కాపాడాలని ఆ యువతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకొని మార్కెట్ నుండి వచ్చిన సైకతరావు కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు చెప్పారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications