దారుణ హత్య: యువకుడి తలను పోలీస్‌స్టేషన్లోకి విసిరేశారు(వీడియో)
ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కొందరు దుండగులు.. అతడి తలను ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి విసిరేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కాగా, తలను విసిరేసిన దృశ్యాలు పోలీస్ స్టేషన్లోని
పుదుచ్చేరి: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కొందరు దుండగులు.. అతడి తలను ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి విసిరేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కాగా, తలను విసిరేసిన దృశ్యాలు పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరులో బుధవారం రాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆగారు. ఓ వ్యక్తి దిగి.. మొండెం లేని తలను స్టేషన్ లోపలికి విసిరేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్నవారు స్టేషన్లో పడి ఉన్న తలను చూసి భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ దుర్మార్గం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇటీవల పుదుచ్చెరీలో ఓ 17ఏళ్ల యువకుడి హత్య జరిగింది. స్థానికంగా ఉన్న ఓ సరస్సులో తలలేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీస్‌స్టేషన్లోకి విసిరేసిన తల ఆ యువకుడిదే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కాగా.. యువకుడి మృతదేహాం లభించిన సరస్సు ప్రస్తుత పోలీస్ స్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడుతోంది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. స్వేతన్ అనే యువకుడిగా ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications