ఒన్ సైడ్ లవ్, యువతికి లైంగిక వేధింపులు, కసితీరా కత్తితో పొడిచి హత్య, చెన్నైలో ఆంధ్రా యువకుడు !

చెన్నై: ఒన్ సైడ్ లవ్ కారణంగా యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడు చివరికి రాక్షసుడై ఆమెను దారుణంగా హత్య చేశాడు. యువతి తండ్రి దగ్గర మంచి ప్రవర్తన కలవాడిలా నిటించి చివరికి ఆమెను నమ్మించి హత్య చేశాడు. యువతి హత్యకు గురి కావడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వన్ సైడ్ లవర్ ను చెన్నై నగరం సమీపంలోని మామల్లాపురం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం

కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో (చెన్నై సిటీ సమీపం) విరూద్ నగర్ జిల్లాకు చెందిన జయరాజ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. జయరాజ్ కు లావణ్య (17) అనే కుమార్తె ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరానికి చెందిన దుర్గారావ్ (24) చెన్నై సమీపంలోని మామల్లాపుర్ చేరుకుని జయరాజ్ దగ్గర మేస్త్రీగా పని చేస్తున్నాడు.

 యజమాని కుమార్తె మీద కన్ను

యజమాని కుమార్తె మీద కన్ను

తన యజమాని జయరాజ్ కుమార్తె లావణ్య మీద దుర్గారావ్ కన్ను పడింది. కొంత కాలం నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని లావణ్యకు చెప్పాడు. అయితే తాను చదువుకోవాలని, తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే తాను వివాహం చేసుకుంటానని లావణ్య దుర్గారావ్ కు

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

తాను ప్రేమించనని లావణ్య చెప్పినా దుర్గారావ్ మాత్రం ఆమె వెంటపడుతూ వచ్చాడు. తనను ప్రేమించాలని, ఇద్దరు పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని, నేను మీ కుటుంబ సభ్యులు చెప్పినట్లు నడుచుకుంటానని, వారిని బాగా చూసుకుంటానని దుర్గారావ్ లావణ్యకు చెప్పాడు. లావణ్యను పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి జయరాజ్ దగ్గర చాల మంచి ప్రవర్తన కలిగిన యువకుడిగా దుర్గారావ్ నటిస్తూ వచ్చాడు.

గొడవలు వస్తాయని భయం

గొడవలు వస్తాయని భయం

లావణ్యకు దగ్గర అయ్యే నెపంతో ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దుర్గారావ్ చేష్టలతో విసిగిపోయిన లావణ్య ఎక్కడ ఈ విషయం తండ్రి జయరాజ్ కు చెబితో లేనిపోని గొడవలు వస్తాయో అనే భయంతో ఇంత కాలం గడిపింది. అయినా దుర్గారావ్ మాత్రం లావణ్యను విడిచిపెట్టలేదు. నిత్యం ఆమె వెంటపడి వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు.

 ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచి !

ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచి !

గురువారం ఇంటి బయట నిలబడి ఉన్న లావణ్య దగ్గరకు వెళ్లిన దుర్గారావ్ తనను వివాహం చేసుకోవాలని బెదిరించాడు. పెళ్లి చేసుకోవాడినికి లావణ్య నిరాకరించింది. అంతే సహనం కోల్పోయిన దుర్గారావ్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని లావణ్య గొంతు, కడుపు, ఛాతీ తదితర చోట్ల ఇష్టం వచ్చినట్లు దారుణంగా పొడిచాడు. గట్టిగా కేకలు వేస్తూ లావణ్య కుప్పకూలి సృహ కోల్పోపోయింది.

ఎందుకు చంపేశానంటే ?

ఎందుకు చంపేశానంటే ?

లావణ్య కేకలు వేసిన విషయం గుర్తించిన ఆమె బంధువులు వెంటనే లావణ్యను కేళంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై లావణ్య మరణించిందని పోలీసులు అన్నారు. తన ప్రేమను అంగీకరించకుండా వేధింపులకు గురి చేసిందని, అందుకే లావణ్యను హత్య చేశానని దుర్గారావ్ అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మామల్లాపురం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+