మరో కులం వ్యక్తితో సంబంధం, చెల్లెల్ని చంపిన అన్న
మీరట్: మరో కులానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో తన సోదరిని సొంత అన్ననే హతమార్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. ఆ నిందితుడు సోదరిని హత్య చేసిన అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

మరో కులానికి చెందిన యువకుడితో సంబంధం ఉందని, అతను తన సోదరిని గత కొంతకాలంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. అతని పేరు షానవాజ్. వయస్సు 28. తొలుత అతను వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఇంట్లోనే మరో గదిలో బంధించాడు.
ఆ తర్వాత సోదరిని కండువాతో గొంతు బిగించి చంపేశాడు. సోదరుడి నిర్వాకం పైన అతడి చిన్న చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది.












Click it and Unblock the Notifications