దీపావళి రోజే దారుణం: టపాసులు కాలుస్తున్న యువకుడి దారుణ హత్య
భువనేశ్వర్: దీపావళి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టాపాసులు కాలుస్తున్నాడంటూ ఓ యువకుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. దీపావళి పండగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్ వద్దకు వచ్చి టపాసులు కాల్చవద్దని చెప్పి, కాల్చకుండా అడ్డుకున్నారు. తనన అడ్డుకోవడంపై అమరేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా పదునైనా కత్తులతో అమరేశ్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో అమరేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, అమరేశ్ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications