Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కదం తొక్కిన యువత.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)

Recommended Video

    కదం తొక్కిన యువత.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)

    హౌరా : యువత కదం తొక్కింది. ఉద్యోగాల కోసం రోడ్డెక్కింది. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నామంటూ పశ్చిమ బెంగాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలతో పాటు అనుబంధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హౌరా విధుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున యువకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

    నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ యువతకు తగినన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 12 వామపక్ష పార్టీలు, అనుబంధ విద్యార్థి సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. హౌరా జిల్లాలోని బెంగాల్ సచివాలయం వరకు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉద్యోగాలకు సంబంధించిన ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలుపుతున్నారు.

    youth rally in west bengal for jobs

    హుగ్లీ జిల్లాలోని సింగూరు ప్రాంతంలో గురువారం (12.09.2019) నాడు ప్రారంభమైన ఈ ర్యాలీ హౌరాకు చేరుకుంది. ఉద్యోగాల కోసం యువకులు చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. దారి పొడవునా మరికొందరు యువకులు వారికి తోడవుతున్నారు. అయితే నిరసనకారులు బెంగాల్ సచివాలయం వైపుకు వెళుతుండగా వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కూడా ఆందోళనకారులు పోలీసులను లెక్క చేయకుండా ముందుకు వెళ్లడంతో చివరకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. వారిని చెదరగొట్టాలని ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోతోంది.. అంతేకాదు నిలువరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+