యువతితో అసభ్యంగా: నడిరోడ్డులో దుమ్ములేపేశారు, గుండు కొట్టించి ఊరేగింపు ! (వీడియో)
యువతితో అసభ్యంగా, నడి రోడ్డులో దుమ్ములేపేశారు నడి రోడ్డులో గుండు కొట్టించి ఊరేగింపు ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, యువకుడి ఆవేదన
శివపురి: ప్రతినిత్యం యువతిని వేదిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని నడి రోడ్డులో చితకబాదేశారు. తరువాత యువకుడికి గుండు కొట్టించి ఊరేగింపు చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి నగరం సమీపంలో జరిగింది.
23 ఏళ్ల యువకుడు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతిని వేదిస్తున్నాడని సమాచారం. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. యువకుడిని నడిరోడ్డులోకి లాక్కొచ్చి అతన్ని చితకబాదేశారు.
తరువాత రోడ్డులోనే అతనికి గుండు కొట్టించి ఆ ప్రాంతంలో ఊరేగించారు. అయితే యువకుడు మాత్రం తాను ఏ తప్పు చెయ్యలేదని అంటున్నాడు. తను, ఆ అమ్మాయి ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని ఆ యువకుడు అంటున్నాడు.
యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించిన ఆమె కుటుంబ సభ్యులు నేరం తన మీద వేసి నడి రోడ్డులో గుండు కొట్టించి ఊరేగించి అవమానించారని ఆరోపించాడు. యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు సైతం యువకుడి మీద కేసు పెట్టారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications