ప్రేయసిని గర్భవతిని చేశాడు: కొండలపై నుంచి తోసేశాడు

జైపూర్: ప్రేయసిని నమ్మించి మోసం చేసి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత కొండలపై నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నహర్‌గర్ కొండల వద్ద చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువతిని నరేంద్రకుమార్(25) అనే యువకుడు ఏడాది క్రితం ప్రేమించాడు. వీరు పెళ్లికి ముందే శారీరకంగా ఒక్కటయ్యారు.

యువతి గర్భవతి కావడంతో పెళ్లి చేసుకో అని ప్రియుడిని ఒత్తిడి చేసింది. ప్రేయసిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు నహర్‌గర్ కొండల వద్దకి తీసుకెళ్లాడు. ఇక కొండలపై నుంచి ప్రేయసిని కిందకు తోసేశాడు. యువతి చనిపోయిందనే భ్రమతో ప్రియుడు అటు నుంచి వెళ్లిపోయాడు.

 Youth throws pregnant girlfriend off Nahargarh, rescued

అయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశం కావడంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు యువతి పడి ఉండటాన్ని గమనించారు. పర్యాటకులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి తీవ్రంగా గాయపడింది. 12 గంటల తర్వాత యువతి స్పహలోకి వచ్చింది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి కిందికి తోసేశాడు.

నిందితుడు నరేంద్ర కుమార్ నహర్‌నగర్ నివాసి. కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. యువతి బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ నరేంద్ర కుమార్ నివసించే ప్రాంతంలోనే అద్దె ఇంట్లో ఉంటోంది.యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+