సోషల్ మీడియాలో వైరల్: నరికి చంపారు (వీడియో)
చంఢీగడ్: దేశంలో అసహనం పెరిగిపోయింది. చిన్న కారణానికే ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా చంఢీగడ్‌లోని సెక్టార్ 25లో ఉన్న మార్కెట్‌లో అందరూ చూస్తుండగా బుధవారం సాయంత్రం 18 ఏళ్ల యువకుడిని నడిబజారులో కత్తితో నరికి చంపారు. ఈ సంఘటన మొత్తం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం... మృతుడు సెక్టార్ 25లో నివాసం ఉంటున్న వికాస్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి మార్కెట్‌లో స్కూటర్‌పై ఉండగా, కొంత మంది దుండగులు వచ్చిన వికాస్‌ను కొట్టడం ప్రారంభించారు. దీంతో వారి దెబ్బలకు తట్టుకోలేని అతడు పరిగెత్తాడు.
అయినప్పటికీ అతడిని వదిలిపెట్టకుండా పగబట్టి, ఒక్కడిపై మూకుమ్మడిగా దాడి చేసి బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టారు. ఈ ఘటనలో వికాస్ తలకు వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం కూడా చండీగఢ్‌లోని సెక్టార్ 25లో నిత్యం జనంతో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో చోటు చేసుకుంది.
వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సెక్టార్ 11 పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎస్పీ నవదీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ నిందితులను గుర్తించామని తెలిపారు.
నిందితుల కోసం రెండు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, మృతుడి తండ్రి పీజీఐలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది చూస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications