Youtube: భారత్‍లో 1.7 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. ఎందుకంటే..
ఈ ఏడాది భారత్ లో జూలై-సెప్టెంబర్‌లో యూట్యూబ్ దాదాపు 1.7 మిలియన్ల వీడియోలను తొలగించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు తీసుకుంది. భారత్ లోనే అత్యధిక వీడియోలు తొలిగంచామని యూట్యూబ్ మంగళవారం తన త్రైమాసిక నివేదికలో తెలిపింది. గత త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారతదేశంలో 1.32 మిలియన్ వీడియోలను తొలగించింది. ప్రధానంగా పిల్లల భద్రత, హింస, అశ్లీలత, బెదిరింపు, హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5.6 మిలియన్ల వీడియోలను డిలేట్ చేశారు.

థంబ్‌నెయిల్
తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్‌నెయిల్‌లు, స్కామ్‌లు, వీడియో, స్పామ్ కామెంట్‌లపై తన విధానాలను ఉల్లంఘించినందుకు 2022 మూడవ త్రైమాసికంలో Google యాజమాన్యంలోని ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా ఛానెల్‌లను రద్దు చేసింది. భారత్ లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు 1,707,204 వీడియోలు తొలగించారు. ఇండియా తర్వాత ఇండోనేషియాలో 6,28,539 వీడియోలను తొలగించారు.

68 శాతం వీడియోలు
YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలు కంటెంట్ ఎక్కడ అప్‌లోడ్ చేసినా వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అమలు చేసిన ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల ద్వారా 94 శాతానికి పైగా వీడియోలు తొలగించామని కంపెనీ వివరించించింది. తీసివేయబడిన వీడియోలలో 68 శాతం వీడియోలకు 10 వ్యూస్ కూడా లేవని తెలిపింది. మెషిన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్‌లను ఉపయోగించి వీడియోలను తొలగించినట్లు పేర్కొంది.

IP చిరునామాపై
ప్రపంచవ్యాప్తంగా తొలగించన 8 యూట్యూబ్ వీడియోలను మాత్రమే ప్రభుత్వ ఏజెన్సీలు ఫ్లాగ్ చేశాయని నివేదిక తెలిపింది. వీడియో గురించిన డేటా అప్‌లోడర్ IP చిరునామాపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా అప్‌లోడర్ ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉంటుంది. వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ వ్యక్తులు, సాంకేతికత కలయికను ఉపయోగించి దాదాపు 737.5 మిలియన్ కామెంట్లను కూడా తొలగించినట్లు కంపెనీ తెలిపింది.












Click it and Unblock the Notifications