Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆగిపోయిన యూట్యూబ్ సర్వీసులు: నెటిజన్ల ఫిర్యాదులు, వెంటనే స్పందించిన సంస్థ

Recommended Video

    YouTube Was Down For Several Hours Today

    న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ సేవలు ఆకస్మత్తుగా బుధవారం(అక్టోబర్ 17) నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది.

    దీంతో అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను ఆ సంస్థ దృష్టికి తెలియజేశారు. దీనికి యూట్యూబ్ స్పందించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ
    ట్విట్టర్‌లో పేర్కొంది.

    YouTube services resume after rare global outage

    ఆ తర్వాత మరో ట్వీట్‌లో సమస్య పరిష్కారమైందని, మీ ముందుకు మళ్లీ వచ్చామని.. సహనంతో వేచిచూసినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

    కాగా, అంతకుముందు, యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేశారు.

    అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్‌ లాగిన్‌ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 40నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ సర్వీసులు పునర్ ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

    More From
    Prev
    Next
    Read in English: YouTube is down
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+