తల్లిదండ్రుల శృంగారంపై వల్గర్ కామెంట్స్ .. తాట తీస్తానన్న సీఎం
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా ఓ వివాదంలో చిక్కుకున్నారు. రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్‌లో అతడు శృంగారంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు."నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం చూస్తావా లేదా ఒక్కసారి చేరి శాశ్వతంగా ఆపేస్తావా?" అంటూ షోకి వచ్చిన పోటీదారుడిని ప్రశ్నించాడు.
రణవీర్ అల్లాబాడియా చేసిన ఈ కామెంట్స్‌పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శృంగారంపై రణవీర్ చేసిన వల్గర్ కామెంట్స్ అతని నిజస్వరూపాన్ని బయటకు తీసుకొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిని చాలా మంది కామెడీగా ఫీల్ అవుతున్నారని, కానీ ఇది వల్గారిటీ అని ప్రముఖ వ్యాపారవేత్త థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వేలుమణి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి వారి ఛానెల్స్ చూడటం ప్రజలు బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. వీరి ఛానెల్స్ బ్యాన్ చేయాలని కూడా ఆయన కోరారు.

ప్రస్తుతం రణవీర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇక ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.ఈ ఘటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం మాట్లాడుతూ...హద్దులు దాటిన వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.ఇక తనపై విమర్శలు తీవ్రతరం కావడంతో రణవీర్ అందర్నీ క్షమాపణలు కోరారు. రణవీర్ విషయానికి వస్తే..
జూన్ 2, 1993న ముంబైలో జన్మించిన రణవీర్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నాడు. ద్వారకాదాస్ జీవన్‌లాల్ సంఘ్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు దాదాపు 7 యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్నాడు. వాటిలో ఒకటి బీర్‌బైసెప్స్, దీనికి కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న సంగతి తెలిసిందే.
యూట్యూబ్ నుంచి దాదాపు రూ.35 లక్షలు అలాబాడియా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో రణవీర్ అల్లాబాడియా మెుత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.60 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ముంబైలో సొంత ఇల్లు కూడా ఉంది. పైగా మాంక్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడిగా రణవీర్ ఉన్నారు. అలాగే రూ.40 లక్షలు విలువైన కారు కూడా అతడికి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications