గుజరాత్ భవన్లో మోడీని కలిసిన వైయస్ జగన్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీలో పలు అంశాలను మోడీ దృష్టికి జగన్ తీసుకు వెళ్లారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని, కేంద్రం ఇచ్చిన హామీల్లో అస్పష్టత ఉందని, ఆ అస్పష్టతను తొలగించాలని ఆయన కోరారు. భేటీ సందర్భంగా.. ఘన విజయం సాధించినందుకు మోడీకి అభినందనలు తెలిపారు.
సీమాంధ్ర, తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. విభజన సందర్భంగా కేంద్రం దారుణంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరినట్లు తెలిపారు. తాను ప్రచారం సందర్భంగా కూడా మోడీని వ్యతిరేకించలేదన్నారు. బిజెపికి స్పష్టమైన మెజార్టీ ఉన్నందున తమ మద్దతు అవసరం లేదని, అంశాల ప్రాతిపదికన మద్దతిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications