నరేంద్ర మోడీని కలవనున్న జగన్, కెసిఆర్‌కు ఫోన్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీల బృందం సోమవారం కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. అనంతరం ఆయనకు ఓ వినతి పత్రాన్ని ఇస్తారు. అఖండ విజయం సాధించిన మోడీకి జగన్ అభినందనలు తెలియజేయనున్నారు. అదే సమయంలో విభజన సమయంలో సీమాంధ్రకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరనున్నారు.

YS Jagan will meets Narenda Modi

కెసిఆర్‌కు మోడీ అభినందనలు

నరేంద్ర మోడీ తెరాస అధ్యక్షులు కెసిఆర్‌కు ఆదివారం ఫోన్ చేశారు. తాను ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం తేదీ, సమయం, వేదిక వివరాల సమాచారం పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వాస్తవానికి కెసిఆరే ఢిల్లీకి వెళ్లి మోడీని అభినందించాలనే ఉద్దేశంతో ఉన్నారని, ఇప్పుడు ఆయనే స్వయంగా ఫోన్ చేశారని, ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా కెసిఆర్‌కు ఆదివారం ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించారు.

కెసిఆర్ మూడో కూటమిలో ఉంటారా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉన్నది తెలుగు ప్రజలేనని, వారిని రెచ్చగొట్టకుండా పరిపాలించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె చంద్రశేఖర రావులకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు సూచించారు. మూడో కూటమికే మద్దతిస్తామన్న కెసిఆర్ ఆ మాటకు కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పార్టీపై తెలంగాణ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చేలా తెరాస కృషి చేస్తే తాము కూడా అండదండగా ఉంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+