రాజమౌళి మీరు గ్రేట్: మీలా కథను ఎవరూ చెప్పలేరు: రఘురామ
రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ గురించి టాక్. మూవీ గురించి హీరోలు, దర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నారా లోకేశ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా రియాక్ట్ అయ్యారు. మూవీ బాగుందని పొగిడారు. అయితే ఆయన ఎప్పుడూ వైసీపీ, జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసేవారు. ఈసారి సినిమా గురించి మాట్లాడారు. అదీ కూడా రాజమౌళి గురించి ప్రశంసలు కురిపించారు.

ఆర్ఆర్ఆర్ టాకే..
ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజే రూ.223 కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ వారంలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడంతో దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర యూనిట్ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసి చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ టాక్ వినిపిస్తోంది.

చెదిరిన కళ్లు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చూశానని.. కళ్లు చెదిరిపోయాయంటే అతిశయోక్తి కాదన్నారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్‌గా రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చారని కొనియాడారు. వెండితెరపై కథను చెప్పడంలో తనకు తిరుగులేదని రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు తెలియజేశారు. సినిమా చాలా బాగుందన్నారు.

చరణ్, ఎన్టీఆర్‌తో రఘురామ
గతంలో తాను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో విడివిడిగా దిగిన ఫొటోలను కూడా రఘురామ పంచుకున్నారు. వారిద్దరూ తనకు క్లోజ్ అనే హింట్ ఇచ్చారు. మరోవైపు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్‌కు మరో ట్వీట్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే చరణ్ అంటూ రఘురామ విష్ చేశారు. ఆర్ఆర్ఆర్ హిట్‌తో చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. వారిద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.












Click it and Unblock the Notifications