రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్‌సీపీ
ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాము బిల్లును వ్యతిరేకించినట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి, బిల్లును పున:పరీశీంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
మరోవైపు టీడీపీకి ఉన్న ఇద్దరు ఎంపీలు కూడ చర్చలో పాల్గనకపోవడంతో ఓటింగ్ దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఇక టీఆర్ఎస్ పార్టీ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.టీఆర్ఎస్ బిల్లును వ్యతిరేకించకపోయినా అందులో ఉన్న కొన్ని నిబంధనలును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ట్రిబుల్ తలాక్ చెప్పిన వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే భార్యలను ఎవరు పోషిస్తారన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పటి వరకు బిల్లుపై ఎలాంటీ నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది మాత్రం అధికారికంగా స్పష్టం చేయలేదు.

ఇక తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఆరుగురు ,వైసీపీకి ఇద్దరు, టీడీపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. మరోవైపు బిల్లును వ్యతిరేకిస్తూ జేడీయూ వాకౌట్ చేసింది. కాగా ఉదయం రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications