రియల్: కోర్టు సమీపంలో హైవే రోడ్డులో కన్నడ హీరోపై హత్యాయత్నం, ఆస్తి వివాదం !

బెంగళూరు-మైసూరు హైవే రోడ్డులో కన్నడ నటుడిపై హత్యాయత్నం జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసిన ప్రత్యర్థులు అతని మీద హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పరారైన ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని ఐ

బెంగళూరు: బెంగళూరు-మైసూరు హైవే రోడ్డులో కన్నడ నటుడిపై హత్యాయత్నం జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసిన ప్రత్యర్థులు అతని మీద హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పరారైన ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని ఐజూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

యుగపురుష అనే కన్నడ చిత్రం హీరో అర్జున్ దేవ్ మీద మంగళవారం హత్యాయత్నం జరిగిందని ఐజూరు పోలీసులు తెలిపారు. కన్నడ సినిమా యుగపురుష అనే సినిమాలో అర్జున్ దేవ్ హీరోగా నటించాడు. ఇతను మంగళవారం బెంగళూరు-మైసూరు హైవేలోని రామనగర జిల్లా కోర్టు సమీపంలోని ఎస్ బీఎం బ్యాంకు దగ్గర కారులో వెలుతున్నాడు.

Yugapurusha Kannada film actor Arjun Dev today attacked by miscreants on the Mysuru-Bengaluru highway

అదే సమయంలో ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. అర్జున్ దేవ్ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి ఇనుప రాడ్లు, కర్రలతో దాడిచేసి అద్దాలు ధ్వంసం చేశారు. తరువాత అర్జున్ దేవ్ మీద హత్యాయత్నం చేశారు. స్థానికులు గుమి కూడటంతో నిందితులు అక్కడి నుంచి పరారైనారు.

ఆస్తి వివాదానికి సంబంధించి అర్జున్ దేవ్ మంగళవారం రామనగర న్యాయస్థానం ముందు హాజరుకావడానికి అక్కడికి వచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఆస్తి వివాదానికి సంబంధించి అర్జున్ దేవ్ మీద హత్యాయత్నం జరిగి ఉంటుందని, అతను ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నామని ఐజూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+