వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడిపై యువకుడి అత్యాచారయత్నం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బాలుడి మీద లైంగిక దాడి చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కామాంధుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని బెంగళూరు నగర పోలీసులు అన్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాం పురలో నివాసం ఉంటున్న మహమ్మద్ రఫిక్ (25) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతని ఇంటి పక్కనే 10 సంవత్సరాల బాలుడు నివాసం ఉంటున్నాడు. బాలుడి తండ్రి రఫిక్ తో కలిసి కూలి పని చేస్తున్నాడు.

బుధవారం రఫిక్, బాలుడి తండ్రి సమీపంలోని కట్టడం దగ్గర పని చేశారు. తరువాత అదే రోజు రాత్రి బాలుడి తండ్రి సిగరేట్ తెచ్చుకోవడానికి అంగడి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో రఫిక్ బాలుడిని ఎత్తుకుని సమీపంలో నిర్మాణంలో ఉన్న కట్టడం దగ్గరకు వెళ్లాడు.

తరువాత బాలుడి మీద లైంగిక దాడి చేసి అక్కడి నుండి పరారైనాడు. బాలుడు కనపడటం లేదని కుటుంబ సభ్యులు గాలించారు. కట్టడం దగ్గర రక్తం ఎక్కువ పోవడంతో కేకలు వేస్తున్న కుమారుడిని గుర్తించి జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన రఫీక్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి దర్యాప్తు చేస్తున్నామని హెచ్ఏఎల్ పోలీసులు తెలిపారు.

English summary
yugster rape attempt a 10-years- boy in bangalore, police arrested accused near HAL airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X