వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జకిర్ నాయక్‌కు షాక్... పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్‌ రద్దు చేయనున్న మలేషియా

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్‌పై మలేసియా ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. మలేషియాలో జకిర్ నాయక్‌కు ఉన్న పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్‌ను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలోనే మలేషియా ప్రధానమంత్రితో పాటు పలువురు మంత్రులు జకీర్ నాయక్ అంశంపై చర్చించారు. దీంతో మెజారీటి నేతలు జకీర్ నాయక్‌ను దేశం నుండి పూర్తిగా బహిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8న మలేసియాలోని హిందువులు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎక్కువ విధేయంగా ఉంటారని జకీర్ నాయక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు భారతదేశంలో ముస్లింల కంటే మలేషియా ముస్లింలే వంద శాతం ఎక్కువ ఎంజాయ్ చేస్తారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలను మలేషియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

మరోవైపు ఆయన ప్రసంగాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలను నిరోధించవలసి ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జకీర్ నాయక్‌పై 150పైగా కేసులు నమోదయ్యాయని దీంతో కూడ మలేషియాలోని పలు రాష్ట్రాలు ఆయన ప్రసంగాలను రద్దు చేశాయి.

 Zakir Naiks permanent resident status in Malaysia may have been revoked,

కాగా భారత ప్రభుత్వం జకీర్ నాయక్ పాస్‌పోర్టును కూడ రద్దు చేసిన నేపథ్యంలోనే మలేషియా తలదాచుకునేందుకు 2016లోనే భారత్ విడిచి పారిపోయారు.. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఆయన పౌరసత్వం ఇచ్చింది. కాగా జకీర్ నాయక్‌ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ కేసు నమోదు చేసింది. పీస్ టీవీ ద్వార ఉగ్రవాదుల కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు జకీర్ నాయక్ ఎదుర్కోంటున్నారు. ఇదివరకే జకిర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించాలని భారత దేశం మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు కూడ మలేషియా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
Zakir Naik has been summoned for a second time by Malaysian authorities over his alleged racial remarks against Hindus and Chinese,his permanent resident status in Malaysia has been revoked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X