Zomato: జొమాటో వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఆ పేరు కనిపించదోచ్..

Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి తెలుసు. చిన్న స్టార్టప్ గా ప్రారంభమైన సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ఎంతో మంది ఆకలిని తీర్చింది. ఆర్డర్ పెట్టిన నిమిషాల్లో వినియోగదారులకు కావాల్సిన ఫుడ్ ను అందించింది. నిత్యం లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తూ ఉంటుంది. బ్లింకిట్ ను జొమాటో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా జొమాటో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరును మార్చుకుంది. ఇక మీదట జొమాటో లిమిటెడ్ కు బదులు 'ఎటర్నల్ లిమిటెడ్'గా పేరును మార్చుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ పేరును మార్చడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ఆమోదించగా.. షేర్ హోల్డర్ల ఆమోదం కోసం వేచి ఉంది.

జొమాటో కొంతకాలం క్రితం బ్లింకిట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు అది కంపెనీలో పెద్ద భాగంగా మారింది.కార్పొరేట్ వెబ్ సైట్ Zomato.com నుంచి eternal.comకి మారుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ కంపెనీ వాటాదారులకు ఒక లేఖలో రాశారు. స్టాక్ టిక్కర్ ను జొమాటో నుంచి ఎటర్నల్ కు మారుస్తామన్నారు. ఎటర్నల్ లో జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ అనే నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయన్నారు. జొమాటో కాకుండా వేరే వ్యాపారం కీలక స్తంభంగా మారినప్పుడు.. కంపెనీ పేరును ఎటర్నల్ గా మార్చాలని అనుకున్నామని.. ఇప్పుడు బ్లింకిట్ తో తాము అనుకున్న స్థాయికి చేరుకున్నామని భావిస్తున్నామన్నారు. అందుకే కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్ గా మార్చడానికి నిర్ణయించామన్నారు. దీపిందర్ గోయల్ ప్రకారం.. ఎటర్నల్ అనేది కేవలం ఒక పేరు కాదు.. అది ఒక లక్ష్య ప్రకటన.

Zomato Rebrands A Big Change to Eternal Limited

ఏమీ మారుతుందంటే..?
కంపెనీ పేరు: జొమాటో లిమిటెడ్ → ఎటర్నల్ లిమిటెడ్
వెబ్ సైట్: Zomato.com → eternal.com
స్టాక్ టిక్కర్: జొమాటో → ఎటర్నల్
ప్రధాన వ్యాపారాలు: జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్

కంపెనీ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జొమాటో, బ్లింకిట్ వంటి బ్రాండ్లు గతంలో లాగే పని చేస్తాయి. కస్టమర్లు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోరు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ 17 ఏళ్ల క్రితం 2007లో ఫుడీబే పేరుతో ఈ కంపెనీని ప్రారంభించగా.. అది తర్వాత పెద్ద కంపెనీగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+