వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Zubair: అల్ట్ న్యూస్ జుబైర్ కు బెయిల్ మంజూరు, ఢిల్లీ కేసులో లైన్ క్లియర్, 4 ఏళ్ల క్రితం ట్వీట్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ లక్నో: ఫ్యాక్ట్ చెకెర్, అల్ట్ న్యూస్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు మోహమ్మద్ జుబైర్ కు ఢిల్లీ కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. ఇటీవల సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు అయినా మోహమ్మద్ జుబైర్ జైల్లోనే ఉండవలసి వచ్చింది. ఢిల్లీ కేసులో మహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆయన ఇన్ని రోజులు జైల్లో ఉండవలసి వచ్చింది. మతఘర్షణలు జరిగేలా, ప్రజలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలను కించపరిచి మోహమ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు జుబైర్ మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మోహమ్మద్ జుబైర్ మీద ఢిల్లీలో హిందూ దేవుళ్లను కించపరిచి ట్వీట్ చేశాడని కేసులు నమోదు అయ్యాయి 2018లో హిందూ ధార్మిక మనోభావాలు దెబ్బతినా ట్విట్ చేశాడని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Illegal affair: పక్కింటోడితో క్యాబ్ డ్రైవర్ భార్య రొమాన్స్, మంచిరోజు చూసి ఎస్కేప్, భర్త ఏం చేశాడంటే ? !Illegal affair: పక్కింటోడితో క్యాబ్ డ్రైవర్ భార్య రొమాన్స్, మంచిరోజు చూసి ఎస్కేప్, భర్త ఏం చేశాడంటే ? !

 రెచ్చగొట్టే ట్వీట్ చేశాడని కేసులు

రెచ్చగొట్టే ట్వీట్ చేశాడని కేసులు

మతఘర్షణలు జరిగేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఫ్యాక్ట్ చెకర్, అల్ట్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు మోహమ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఉత్తరప్రదేశ్ లోని సీతాపుర పోలీస్ స్టేషన్ లో సీతాపుర జిల్లా హిందూ షేర్ సేనా అధ్యక్షుడు భగవాన్ శరణ్ ఇటీవల కేసు పెట్టారు. సీతాపుర పోలీసులు మోహమ్మద్ జుబైర్ మీద మీద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 సుప్రీం కోర్టుకు వెళ్లిన జుబైర్

సుప్రీం కోర్టుకు వెళ్లిన జుబైర్

మోహమ్మద్ జుబైర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. బెయిల్ మంజూరు చెయ్యడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించడంతో మోహమ్మద్ జుబైద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఇటీవల మోహమ్మద్ జుబైద్ కు ఐదు రోజుల పాటు మధ్యంతర జామీను మంజూరు చేసి ఉత్తరప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

 అన్ని కేసుల్లో బెయిల్ !

అన్ని కేసుల్లో బెయిల్ !

సీతాపూర్ కేసుకు సంబంధించి మాత్రమే మోహమ్మద్ జుబైదార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని, మరే కేసులకు, ఎఫ్ఐఆర్ లకు ఈ బెయిల్ షరతులు వర్తించవని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మోహమ్మద్ జుబైదార్ ట్వీట్ లు తారుమారు చెయ్యకూడదని, సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించకూడదని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తరువాత జుబైర్ కు ఆయన మీద నమోదు అయిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది.

 బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

మోహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని ఉత్తరప్రదేశ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినా సుప్రీం కోర్టు మోహమ్మద్ జుబైర్ కు మధ్యంతర జామీను మంజారు చేసింది. ఢిల్లీలో కూడా మోహమ్మద్ జుబైర్ మీద కేసు నమోదు కావడంతో అతనికి ఇబ్బందులు ఎదురైనాయి. 2018లో హిందూ మనోభావాలు దెబ్బతినేలా మొహమ్మద్ జుబైర్ ట్వీట్ చేశాడని ఆయన మీద కేసు నమోదు అయ్యింది. జులైన 14వ తేదీ శుక్రవారం జుబైల్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 బెయిల్ ఇవ్వకూడదని వాదనలు

బెయిల్ ఇవ్వకూడదని వాదనలు

జులైన 14వ తేదీ శుక్రవారం (ఈరోజు) జుబైల్ కేసు విషయంలో ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. జుబైల్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవస్తవా కోర్టుకు మనవి చేశారు. నాలుగు సంవత్సరాల కేసు ఇప్పుడు బయటకు తీశారని, రాజకీయ కక్షల కారణంగా జుబైర్ ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరపు న్యాయవాది ఉమాంగ్ రావత్ కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న ఢిల్లీ కోర్టు మోహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చేసింది. ఉత్దరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తన మీద నమోదు అయిన ఆరు కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చెయ్యాలని మోహమ్మద్ జుబైర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

English summary
Zubair: A Delhi court has granted bail to Mohammad Zubair in a case related to his offensive tweet against a Hindu deity in 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X