Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒమిక్రాన్ విజ‌ృంభిస్తోన్న వేళ..ఇంజెక్షన్‌తో పని లేని కరోనా వ్యాక్సిన్: కేంద్రం గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. దేశంంలో విజ‌‌ృంభణ మొదలు పెట్టింది. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విస్తరిస్తోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య అయిదుకు చేరింది. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొదట్లో రెండింటికి మాత్రమే పరిమితమైన ఒమిక్రాన్ సంఖ్య.. ఇప్పుడు ఎనిమిదికి చేరింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 100కు చేరువయ్యాయి.

Recommended Video

    Omicron Variant : Center On Booster Dose | Omicron Cases In India || Oneindia Telugu
    మరో గుడ్‌న్యూస్..

    మరో గుడ్‌న్యూస్..

    కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, హర్యానా ఇలా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ ఇచ్చింది. మరో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి దీన్ని చేర్చనున్నట్లు పేర్కొంది. ఇంజెక్షన్, నీడిల్ అవసరం లేని వ్యాక్సిన్ ఇది.

    జైడస్ క్యాడిలా వ్యాక్సిన్..

    జైడస్ క్యాడిలా వ్యాక్సిన్..

    అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. దీని పేరు జైకోవ్-డీ. వచ్చేవారం ఈ టీకాను వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి చేర్చనున్నట్లు పేర్కొంది. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి వీలుగా ఈ వ్యాక్సిన్‌కు ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. డీఎన్ఏ ఆధారిత టీకా ఇది. ఇంజెక్షన్ అవసరం లేని ఈ తరహా వ్యాక్సిన్.. అందుబాటులోకి రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.

    రెండున్నర లక్షల డోసులకు క్లియరెన్స్..

    రెండున్నర లక్షల డోసులకు క్లియరెన్స్..

    తొలిదశలో రెండున్నర లక్షల డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రానుందీ కంపెనీ. హిమాచల్ ప్రదేశ్‌ కసౌలీలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ.. దీనికి అవసరమైన అనుమతులను ఇచ్చింది. క్రమంగా వీటి సంఖ్య పెరుగుతుంది. 12 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికీ ఈ వ్యాక్సిన్ ఇచ్చే వీలు ఉంది. పిల్లలు, యుక్త వయస్సు వచ్చిన వారికి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి విధానపరమైన నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు.

     12 సంవత్సరాల వారికీ

    12 సంవత్సరాల వారికీ

    ఫలితంగా- జైకోవ్ డీ వ్యాక్సిన్‌ను 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు వారికి మాత్రమే ఇస్తారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్డర్లను కూడా ఇచ్చింది. తొలి దశలో 10 మిలియన్ వ్యాక్సిన్ డోసులకు అనుమతి ఇచ్చింది. ఒక్కో డోసు ధర 265 రూపాయలుగా నిర్ధారించింది. రాష్ట్రాలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దశలవారీగా జైడస్ క్యాడిలా యాజమాన్యం నేరుగా రాష్ట్రాలకు వాటిని అందజేస్తుంది.

    తొలి విడతలో..

    తొలి విడతలో..

    తొలి విడతలో బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తుంది కేంద్రం. డోసుల లభ్యత ఆధారంగా మిగిలిన రాష్ట్రాలకు విస్తరింపజేస్తుంది. మూడు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. చాలినన్ని డోసులను తయారు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు జైడస్ క్యాడిలాకు ఉన్నాయని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+