ఇండోనేసియా భారీ భూకంపం, సునామీ: జైళ్ల నుంచి 1200 ఖైదీలు పరారీ
జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం, సునామీ పెను బీభత్సం సృష్టించింది. 832 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం, సునామీ కారణంగా పోలీసులు సహాయక చర్యల్లో ఉన్నారు. మరోవైపు జైళ్లలోని ఖైదీలు 1200 మంది వరకు పారిపోయారు.
ఈ మేరకు ఇండోనేసియా న్యాయ శాఖ మంత్రి సోమవారం తెలిపారు. సునామీ సంభవించిన పాలూ నగరంలో జైలు గోడలు కూలిపోవడంతో ఖైదీలు అక్కడి నుంచి పారిపోయారు. నీరు పెద్ద ఎత్తున జైళ్లలోకి వచ్చింది. దీంతో ఖైదీలు రోడ్ల మీదకు పరుగులు తీశారు.

ఆ తర్వాత భూకంపం భయంతో చాలామంది ఖైదీలు పారిపోయారని, ఇది ఖైదీల చావుబతుకులకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరో చోట ఖైదీలు జైలు మెయిన్ గేటు ధ్వంసం చేసి పారిపోయారని చెప్పారు. ఓ జైలులో మంటలు రావడంతో 343 ఖైదీలు తప్పించుకున్నారని చెప్పారు.
పాలూ నగరంలోని రెండు జైళ్లలో కేవలం వందమంది మాత్రమే ఖైదీలు ఉన్నారని మంత్రి చెప్పారు. అయితే సునామీ కారణంగా భారీ నష్టం జరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలకు ఆహారం అందించేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications