అంతరించిపోతున్న 1300ఏళ్లనాటి వృక్షం గుర్తింపు
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్‌లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్‌జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్‌లో కొనుగొన్నారు.
‘యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ చెట్టు ఎత్తు 35 మీటర్ల ఎత్తు, 2.2 మీటర్ల వ్యాసార్థంతో ఉన్నట్లు చైనా అటవీశాఖ తెలిపింది. ఈ చెట్టు పక్కనే మరో రెండు చెట్లను గుర్తించారు.

అరుదైన మూడు టాక్సస్ చైనెన్సీస్ చెట్లను పరిరక్షించేందుకు స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చైనా అధికార పత్రిక సిన్హువా పేర్కొంది. ప్రభుత్వం కూడా ఈ అరుదైన వృక్షజాతిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Taxus chinensis in Northern Vietnam
#greatnature #MBZSCF pic.twitter.com/susBCw1WJV
— Pham Van The (@phamvthe) October 11, 2013 టెక్సాస్ చైనెన్సీస్ వృక్షజాతి 25 లక్షల ఏళ్ల నుంచి మనుగడలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయని, క్యాన్సర్ చికిత్సకు దీనిని ఉపయోగిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications