మరో ప్రమాదం: అమెరికాలో టీవీ టవర్‌ను ఢీకొట్టిన విమానం

టెక్సాస్: ఇటీవల తైపేలో జరిగిన విమాన ప్రమాద ఘటన మరువకముందే తాజాగా అమెరికాలో మరో చిన్న సైజు విమానం కూలింది. ఈ ఘటన పశ్చిమ టెక్సాస్‌లో చోటు చేసుకుంది. టీవీ టవర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో విమానంలోని ఓ వ్యక్తి మృతి చెందారు. బుధవారం రాత్రి ఒకే ఇంజిన్ కలిగిన పిఏ-46 అనే విమానం ఈశాన్య లుబక్ ప్రాంతంలోని కెసిబిడి టీవీ టవర్‌ను ఢీకొని కుప్పకూలిపోయిందని లుబక్ ఫైర్ డిపార్ట్ మెంట్ డివిజన్ చీఫ్ స్టీవ్ హోలాండ్ తెలిపారు.

1 dead after plane crashes into West Texas TV tower

రాత్రి 7.30గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని ఆయన చెప్పారు. ఆ విమానం టెక్సాస్‌లోని ప్రెస్టాన్ స్మిత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.

కాగా, గత మేలో అమెరికాలో జరిగిన చిన్న సైజు విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి పైలట్ కాక్‌పిట్‌లో బాధ్యతా రహితంగా సెల్ఫీలు దిగడమే కారణమని విచారణాధికారులు ఇటీవలే తేల్చారు. ఇటీవల తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో సుమారు 24మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+